దేశంలో కరోనా పంజా.. 3.47లక్షలు దాటిన కేసులు

దేశంలో కరోనా పంజా.. 3.47లక్షలు దాటిన కేసులు
  • దేశంలో 3.47 లక్షల కేసులు..703 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొత్తగా 3 లక్షల 47 వేల 254 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడిన వారిలో 703 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 20 లక్షలు దాటాయి. నిన్న ఒక్కరోజులో కరోనా నుంచి 2 లక్షల 51 వేల 777 మంది కరోనాను జయించి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 2 లక్షల 18 వేల 825 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 93.50  శాతంగా ఉంటే... మరణాల రేటు 1.27 % గా ఉంది. మరో వైపు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ముమ్మరం చేశాయి. నిన్న గురువారం ఒక్కరోజే 70 లక్షల 49 వేల 779 డోసులు అందించారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 160 కోట్ల 43 లక్షల 70 వేల 484కు చేరింది. కోవిడ్ టెస్టుల పాజిటివిటీ రేటు 17.94% శాతానికి పెరిగింది.