
తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. ఈ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 798 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నైలోనే 538 కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో తమిళనాడులో కేసుల సంఖ్య 8,002కి చేరింది. వైరస్ బారిన పడి సోమవారం ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 53కి చేరింది. మొత్తం కేసులలో 2,051 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 5,895 మంది వివిధ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.