కరోనా వైరస్ కేసు డిసెంబర్ లోనే గుర్తించాం: చైనా

కరోనా వైరస్ కేసు డిసెంబర్ లోనే గుర్తించాం: చైనా

కరోనా వైరస్ కు సంబంధించిన మొదటి కేసును 2019 డిసెంబర్ చివరలో వూహాన్ లో గుర్తించినట్టు చైనా ప్రకటించింది. అప్పట్లో దీనిని ‘న్యూమోనియా ఆఫ్ అన్నౌన్ కాజ్’గా భావించినట్టు సోమవారం వెల్లడించింది. కరోనా ఎక్కడ పుట్టిందనే ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన జవాబు చెప్పని చైనా అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తడంతో తొలిసారి ఈ విషయంపై ప్రకటన చేసింది. కరోనాను వూహాన్ లో డిసెంబర్ నెల చివరలో గుర్తించామని చైనా అధికారిక మీడియా వెల్ల డించింది.

38 పేజీల టైమ్ లైన్ డాక్యుమెంట్

వూహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రి వెన్ష న్.. హుబెయి ప్రావిన్స్లో ‘‘న్యూమోనియా ఆఫ్ అన్నౌన్ కాజ్”పేరుతో కరోనా కేసులను గుర్తించినట్టు చైనా అఫీషియల్ న్యూస్ ఏజెన్సీ జింగ్హూ 38 పేజీల టైమ్ లైన్ డాక్యుమెంట్ ను రిలీజ్ చేసింది. డిసెంబర్ 30న వూహాన్ మున్సి పల్ హెల్త్ కమిషన్ తన పరిధిలోని అన్ని మెడికల్ ఇనిస్టిట్యూట్లకు అర్జంట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. న్యూమోనియా ఆఫ్ అన్ నౌన్ కాజ్తో ఆస్పత్రిలో చేరిన పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని అందులో సూచించింది.

జనవరి 3న డబ్య్లూ హెచ్ఓకు సమాచారం

డిసెంబర్ 31 న ఈ తరహా కేసులకు సంబంధించి మున్సిపల్ కమిషన్ ఓ ప్రకటన చేసింది. 27 మందికి వైరస్ వచ్చిందని, జనం ఎవరూ పబ్లిక్ ప్లేస్ లకు వెళ్లొద్దని, పెద్ద సంఖ్యలో గుమిగూడవద్దని సూచించింది. బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్కులు కట్టుకోవాలని చెప్పింది. ఆ తర్వాత రోజు నుంచి రోజు వారీవివరాలను వెల్లడించడం మొదలుపెట్టింది. జనవరి 3న చైనా కరోనా గురించి డబ్ల్యూహెచ్ ఓ కు సమాచారం అందించింది. జనవరి 23న వూహాన్లో చైనా లాక్ డౌన్ ను ప్రకటించింది. చైనీస్ న్యూ ఇయర్ హాలీడేస్ కోసం అప్పటికే 50 లక్షల మందికిపైగా జనం సిటీని వదిలి వెళ్లిపోయారు.

ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన వైరస్

కరోనా కారణంగా చైనాలో ఇప్పటి వరకూ 3,331 మంది ప్రాణాలు కోల్పోయారు. 81,708 మందికి వైరస్ సోకిందని నేషనల్ హెల్త్ కమిషన్(ఎన్‌‌హెచ్‌‌సి) మంగళవారం తెలిపింది. 1,299 మంది పేషెంట్లు ఇంకా ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఉండగా.. 77,078 మంది పేషెంట్లు కోలుకుని డిశ్చార్ అయ్యారని వెల్లడించింది. కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో ఇప్పటి వరకూ 70 వేల మందికిపైగా చనిపోయారు. 180కి పైగా దేశాల్లో 13 లక్షల మందికిపైగా దీని బారిన పడినట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా చెబుతోంది.