
చైనాలో కరోనా వైరస్ ఎఫెక్ట్ పెరుగుతోంది. మృతుల సంఖ్య 25కు పెరిగింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా సోకుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. హుబి ప్రావిన్స్ లో రక్షణ చర్యలు, అక్కడ నివసిస్తున్న భారతీయులకు వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు సిద్ధమని బీజింగ్ లోని భారత దౌత్య కార్యాలయం ప్రకటించింది. చైనా అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు దౌత్య అధికారులు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను, చైనాలో వైరస్ ప్రభావంపై ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉన్నామని, వుహాన్ లో ఆహార కొరత రాకుండా చూసుకుంటున్నామని చైనా అధికారులు భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. కరోనా వైరస్ సంబంధించి సమాచారం కోసం అవసరం ఉన్న వారు ఎంబసీని సంప్రదించవచ్చని అధికారులు చెప్పారు.
see also: