కరోనా : క‌రెన్సీ నోట్లు, మొబైల్ స్క్రీన్లపై 28 రోజుల పాటు తిష్టేస్తుందంట

కరోనా : క‌రెన్సీ నోట్లు, మొబైల్ స్క్రీన్లపై  28 రోజుల పాటు తిష్టేస్తుందంట

కరెన్సీ నోట్లు, టచ్ స్క్రీన్ పరికరాలు మరియు సాధారణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వారాల పాటు ఉంటుందని ఆస్ట్రేలియాకు చెందిన సైంటిస్ట్ లు చెబుతున్నారు.

ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రిపరేషన్‌నెస్ సైంటిస్ట్ లు కరోనా అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని తెలిపారు.  మొబైల్ ఫోన్ టచ్ స్క్రీన్లు, చల్లగా ఉండే గదులు, ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు లేదా 20 డిగ్రీల సెల్సియస్ (68 డిగ్రీల ఫారెన్‌హీట్) వంటి మృదువైన ఉపరితలాలపై వైరస్  28 రోజులు జీవిస్తున్నట్లు గుర్తించారు.

వైరస్ ప్రభావం 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఒక రోజు కన్నా తక్కువ సమయం వరకు ఉంటున్నట్లు వైరాలజీ జర్నల్‌లో పేర్కొంది. వేసవి కాలం కంటే చలికాలంలో ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో వైరస్ ను నియంత్రించడం చాలాకష్టమని సైంటిస్ట్ లు ఆధారాల్ని వెలుగులోకి తెచ్చారు. అయితే ఇది  మహమ్మారి వ్యాప్తిని మరింత ఖచ్చితంగా అంచనా వేయడానికి, దాన్ని తీవ్రతన తగ్గించేందుకు తాము చేస్తున్నట్లు పరిశోధనలు సహాయ పడతాయని ఆస్ట్రేలియా సైంటిస్ట్ లు చెప్పారు.

కరోనావైరస్ ఎక్కువగా డైరక్ట్ గా వ్యాపిస్తుంది

కరోనా సోకిన వ్యక్తి మాట్లాడేటప్పుడు  ముఖ్యంగా దగ్గు, తుమ్ము, శ్వాస తీసుకునేటప్పుడు వారు విడుదల చేసే వైరస్ నిండిన కణాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతున్నట్లు ఆస్ట్రేలియా రీసెర్చ్ సంస్థ సెంట్రల్ డిప్యూటీ డైరెక్టర్ డెబ్బీ ఈగల్స్ తెలిపారు.

టచ్‌ స్క్రీన్ పరికరాలైన మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ఏటీఎంలు, సూపర్‌ మార్కెట్ సెల్ఫ్ సర్వ్ చెక్‌ అవుట్‌లు మరియు విమానాశ్రయ చెక్ ఇన్ కియోస్క్‌లు క్రమం తప్పకుండా శుభ్రం చేయరు. కాబట్టి ఆ ప్రాంతాలతో నిరంతరం శుభ్రం చేయాలని డెబ్బీ ఈగల్స్ చెప్పారు.

చల్లటి ప్రదేశాల్లో కరోనా వైరస్ ఎన్నిరోజుల పాటు ఉందనే అంశంపై కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో చల్లగా ఉన్న 12 ప్రదేశాల్లో పరీక్షలు నిర్వహించగా అందులో వేడికంటే చల్లగా ఉండే ప్రాంతాల్లో ఐదు నుంచి ఏడు రెట్లు ఎక్కువ కాలం ఉంటున్నట్లు కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ కి చెందిన వైరాలజిస్ట్ జుర్జెన్ రిచ్ట్ వెల్లడించారు.