సీఫుడ్ ప్యాకేజీలపై మరోసారి కరోనాను గుర్తించిన చైనా

సీఫుడ్ ప్యాకేజీలపై మరోసారి కరోనాను గుర్తించిన చైనా

బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు లక్షలాదిగా పెరుగుతున్నాయి. వైరస్ నుంచి రక్షణగా మాస్కులు, సోషల్ డిస్టెన్సింగ్ లాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. ఎంత కేర్ తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. వైరస్ నిల్వ ఉండే వస్తువులను పసిగట్టడం కష్టంగా మారింది. తాజాగా చైనాలోని కింగ్‌‌డావోలో ప్యాకేజ్ చేసిన సీఫుడ్ ప్యాకేజీలపై కరోనా వైరస్ కలుషితాలు ఉండటాన్ని హెల్త్ అథారిటీస్ గుర్తించాయి. దీంతో ఫ్రోజెన్ ఫుడ్ దిగుమతులను చైనా బ్యాన్ చేసింది.

ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చే ఫ్రోజెన్ ఫుడ్‌‌, ప్రాసెసింగ్ మీట్‌‌‌ను చైనా నిషేధించింది. ఇంపోర్టెడ్ సీఫుడ్ ప్యాకెట్లపై అక్కడి హెల్త్ అథారిటీస్ టెస్టు చేసిన వాటిలో 51 ప్రాడక్ట్‌‌ల మీద కరోనా వైరస్‌‌ను గుర్తించారు. వీటిల్లో నుంచి ఏ ఒక్క ప్రాడక్ట్ కూడా మార్కెట్‌‌‌లోకి వెళ్లలేదని కింగ్‌‌‌డావో మున్సిపల్ హెల్త్ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. సదరు ప్రాడక్ట్స్‌‌ను పట్టుకున్న ఇద్దరు హ్యాండ్లర్స్‌‌కు కరోనా పాజిటివ్‌‌గా తేలిందని, అయితే వారికి ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు. గతంలో ఒకసారి కూడా సీఫుడ్ ప్యాకేజీలపై కరోనా వైరస్‌‌ను చైనా గుర్తించింది.