డయాబెటిస్ పేషెంట్లకు కరోనా మోస్ట్ డేంజర్

డయాబెటిస్ పేషెంట్లకు కరోనా మోస్ట్ డేంజర్

లండన్/న్యూయార్క్: డయాబెటిస్ పేషెంట్లకు కరోనా వైరస్ సోకితే చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని ఫ్రాన్స్ లోని యూనివర్సిటీ ఆఫ్​ నాంటెస్ రీసెర్చర్లు వెల్లడించారు. వీరికి కరోనా వస్తే ప్రతి 10 మందిలో ఒకరు చనిపోవచ్చని, అది కూడా ఏడురోజుల్లోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. స్టడీలో భాగంగా ఫ్రాన్స్ లోని 53 హాస్పిటళ్లలో మార్చి 10 నుంచి 31 మధ్య అడ్మిట్ అయిన 1,317 మంది డయాబెటిక్ ప్లస్ కరోనా పేషెంట్ల డేటాను వీరు అనలైజ్ చేశారు. వీరిలో 90 శాతం మందికి టైప్ 2 డయాబెటిస్, 3 శాతం మందికి టైప్ 1, మిగతా వారికి ఇతర రకాల డయాబెటిస్ ఉంది. ఇందులో రెండింట మూడొంతుల మంది మగవాళ్లు కాగా, అందరి సగటు వయసు 70 ఏండ్లు ఉన్నాయి. అయితే, హాస్పిటల్ లో అడ్మిట్ అయిన తర్వాత ఏడు రోజులకే ప్రతి ఐదుగురిలో ఒకరిని వెంటిలేటర్ పై పెట్టాల్సి వచ్చింది. అలాగే ఇదే సమయంలో ప్రతి 10 మందిలో ఒకరు చనిపోయారు. 18 శాతం మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో చాలా మందికి ఏడో రోజునే పరిస్థితి సీరియస్ అయిందని, ఏజ్, బీఎంఐ ఎక్కువ కావడం, డయాబెటిస్ వల్ల పలు అవయవాలు దెబ్బతిని ఉండటం వల్లా మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు రీసెర్చర్లు వెల్లడించారు. టైప్ 1 డయాబెటిస్ పేషెంట్లలో మాత్రం మరణాలు సంభవించలేదని చెప్పారు.

ఆటిజం పేషెంట్లకూ మస్త్ రిస్క్

శారీరక, మానసిక ఎదుగుదల సమస్యలు ఉన్న ‘ఇంటలెక్చువల్ అండ్ డెవలప్ మెంటల్ డిసేబిలీటీస్ (ఐడీడీ)’ వ్యక్తులకు కూడా కరోనా వల్ల ప్రాణాలు పోయే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుందని రీసెర్చర్లు అంటున్నారు. ఐడీడీ వ్యక్తులు, ఇతరులపై కరోనా ఎఫెక్ట్ ను తెలుసుకునేందుకు అమెరికాలోని సిరాకీస్ యూనివర్సిటీ, ఎస్ యూఎన్ వై అప్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ రీసెర్చర్లు 30,282 మంది కరోనా పేషెంట్లపై స్టడీ చేశారు. 17 ఏండ్లలోపు ఉన్న ప్రతి 100 మంది కరోనా పేషెంట్లలో ఐడీడీ యేతర వ్యక్తులు 1.6 మంది చనిపోగా, ఇతరుల మరణాల రేటు 1 కన్నా తక్కువ ఉందని తేలింది. అలాగే18 నుంచి 74 ఏండ్ల మధ్యవారిలో ప్రతి 100 మందిలో ఐడీడీ వ్యక్తుల మరణాల రేటు 4.5 కాగా, ఇతరుల మరణాల రేటు 2.7గా ఉన్నట్లు గుర్తించారు. 75 ఏండ్ల పైబడినవారిలో ఐడీడీ వ్యక్తుల మరణాల రేటు 21.1 కాగా, ఇతరుల మరణాల రేటు 20.7గా నమోదైంది. ఐడీడీ వ్యక్తులకు కరోనా సోకితే మిగతా వారి కన్నా మరింత జాగ్రత్తగా ట్రీట్ మెంట్ చేయాల్సి ఉంటుందని, ఇలాంటి వారికి వైరస్ సోకకముందే జాగ్రత్తలు తీసుకోవాలని రీసెర్చర్లు సూచించారు.

ఐడీడీ అంటే?

పుట్టుకతో వచ్చే సమస్యల కారణంగా శారీరక, మానసిక ఎదుగుదల ఆగిపోవడం, ఎమోషనల్ డెవలప్ మెంట్ జరగకపోవడాన్నే ‘ఇంటలెక్చువల్ అండ్ డెవలప్ మెంటల్ డిసేబిలీటీస్ (ఐడీడీ)’ అంటారు. ఆటిజం, డౌన్స్ సిండ్రోమ్, సెరెబ్రల్ పాల్సీ వంటి నాడీ వ్యవస్థ సంబంధిత వ్యాధులు, సెన్సరీ సిస్టమ్, మెటబాలిజం, డీజనరేటివ్ సమస్యల కారణంగా స్కిల్స్ ను పలు పనులు చేసే కెపాసిటీని కోల్పోవడం వంటివన్నీ ఐడీడీ కిందకే వస్తాయి.

For More News..

వరవరరావు ఆరోగ్యం విషమం