కరోనా వైరస్ ను చైనాయే సృష్టించింది

కరోనా వైరస్ ను చైనాయే సృష్టించింది
  • నోబెల్ గ్రహీత మోంటాగ్నియర్ సంచలన ఆరోపణలు

ఫ్రాన్స్ : కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయ్యిందంటూ ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతుండగా వాటిని బలపరిచే విధంగా నోబెల్ అవార్డు గ్రహీత, ఫ్రాన్స్ వైరాలజిస్ట్ ల్యూక్ మోంటాగ్నియర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వైరస్ మానవ సృష్టియేనని చెప్పారు. జంతువుల నుంచి వైరస్ వచ్చిందన్నది అబద్ధమని వుహాన్ లోని వైరాలజీ ల్యాబ్ లోనే ఇది తయారైందన్నారు. ఎయిడ్స్ కు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా కరోనా వైరస్ ను సృష్టించారని ఓ ఫ్రెంచ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కామెంట్ చేశారు. మోంటాగ్నియర్ ఎయిడ్స్ వైరస్ పై పరిశోధనలకు గానూ 2008 లో నోబైల్ ప్రైజ్ అందుకున్నారు. వుహాన్ నేషనల్ బయో సేప్టీ లాబొరేటరీలో ప్రమాదం జరిగిన తర్వాతే కరోనా వైరస్ బయటకు లీక్ అయ్యిందని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇప్పటికే వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయ్యిందన్న వార్తలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్న తరుణంలో మోంటాగ్నియర్ వ్యాఖ్యలు ప్రాధాన్యంగా మారాయి. అమెరికా ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీలు సైతం వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ బయటకొచ్చిందా అన్న దానిపై విచారణ చేస్తున్నాయి. చైనా ఇప్పటికే ఈ ఆరోపణలను ఖండించింది. వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా లీక్ అయినట్లు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేదని తెలిపింది.