పేదోళ్లను పట్టించుకోలేదు..ఎమ్మెలేలకు కరోనా వస్తే..టెస్ట్ లంటూ హడావిడా

పేదోళ్లను పట్టించుకోలేదు..ఎమ్మెలేలకు కరోనా వస్తే..టెస్ట్ లంటూ హడావిడా

కరోనా కట్డడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదట్నించి తప్పటడుగులు వేస్తూ వచ్చింది. పారాసి టమాల్ గోలీ మాటలు మొదలు.. టెస్టుల వరకూ విమర్శలు ఎదుర్కొంది. ఎంత ఎక్కువ మందికి టెస్టులు చేస్తే అంత తక్కువ టైంలో వైరస్ అదుపు చేయొచ్చన్న విషయాన్నిమరిచిపోయింది. ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయాలన్న ప్రజల డిమాండ్ ను  పట్టించుకోలేదు. పొరుగు రాష్ట్రాల్లోరోజుకు వేల సంఖ్యలో టెస్టులు చేస్తుంటే ఇక్కడ మాత్రం వందలతోనే సరిపుచ్చింది. ఎందుకు ఎక్కువ టెస్టులు చేయడం లేదని ప్రశ్నిస్తే ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ మేరకు చేస్తున్నామంటూ చెప్పుకొచ్చింది. మరి పొరుగు రాష్ట్రాలు ఎక్కువ సంఖ్యలో టెస్ట్ లు  చేస్తు న్నారు కదా అని అడిగితే ‘‘ఎవరో ఎక్కువ టెస్టులు చేస్తే మేమెందుకు చేయాలి’’ అని స్వయంగా సీఎం కేసీఆర్ పలుమార్లు మీడియా సమావేశంలో ప్ర శ్నించారు. జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చినా.. హైకోర్టు జోక్యం చేసుకున్నా.. రాష్ట్రప్రభుత్వం కదలలేదు.

వైరస్ ఉధృతి పెరిగి.. సొంత పార్టీ ఎమ్మె ల్యేలకు, వారి అనుచరులకు, ఆఫీసర్లకు వైరస్ సోకడంతో దిగివచ్చింది. పెద్దఎత్తున టెస్టులు చేస్తామని ప్రకటించింది. జీఎచ్ఎంసీ పరిధిలోని 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో 50 వేల కరోనా టెస్టులు చేసేందుకు రెడీని చెప్పింది. ప్రైవేటు హాస్పిటల్స్ లో టెస్టులకు కూడా అనుమతిచ్చింది.

మొదట్లో హడావుడి

కేంద్రం లాక్ డౌన్ మార్చి 25 నుంచి అమలుచేస్తే రాష్ట్రంలో మాత్రం జనతా కర్ఫ్యూ(మార్చి 22) మరుసటి రోజు నుంచి లాక్ డౌన్ ను   ప్రభుత్వం అమలు చేసింది. లాక్ డౌన్ 1, లాక్ డౌన్ 2 సీరియస్ గా అమలు చేసింది. ఆ తర్వాత కేంద్రం కొన్ని రంగాల్లోసడలింపులు ఇచ్చినా.. రాష్ట్రంలో మాత్రంఅమలు చేయబోమని, లాక్ డౌన్ పకడ్బం దీగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆతర్వాత కేంద్రం ఇచ్చిన సడలింపులకు ఓకే చెప్పడమే కాదు.. ఏకంగా రెడ్ జోన్ పరిధిలోనూ లిక్కర్ షాపులకు  అనుమతిచ్చారు.

బులెటిన్ల విడుదలలో గందరగోళం

కరోనా బులెటిన్లవిడుదల విషయంలో కూడా గందరగోళం నెలకొంది. రోజూ హెల్త్ డిపార్ట్ మెంట్ విడుదల చేసే బులెటిన్ అబద్ధాల పుట్టగా ఉందన్న విమర్శలు వచ్చాయి. ఒక్కోసారి మంత్రి చెప్పే పాజిటివ్ కేసులకు బులెటిన్ లో ఉండే వివ రాలకుపొంతన ఉండేది కాదు. కరోనా తో ఓ వ్యక్తి చనిపోతే ఆ విషయాన్ని ప్రభుత్వం దాచిపెట్టింది. చివరికి మృతుడి భార్యకు చెప్పకుండా అంత్యక్రియ లు పూర్తి చేసిందన్న విమర్శలు వచ్చాయి. తన భర్త బతికిఉన్నాడా? లేదా? అన్నది ప్రభుత్వంచెప్పాలం టూ మృతుడి భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో హైకోర్టు చివాట్లుపెట్టడంతో.. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కుటుంబసభ్యులకు చెప్పలేకపోయామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది.

కరోనా రహిత రాష్ట్రం అని చెప్పి..

లాక్ డౌన్ -2 లో ఏప్రిల్ 27న సీఎం కేసీఆర్ మా ట్లాడుతూ.. ఏప్రిల్ చివరికల్లాకొత్త కేసులు రావని, మే మొదటి వారంకల్లా కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం వరకు రాష్ట్రంలో 4,974 పాజిటివ్ కేసులు రాగా.. 185 మంది చనిపోయారు. పెద్ద ఎత్తున టెస్టులు చేస్తే సమస్య ఇంతవరకు వచ్చేది కాదని హెల్త్ ఎక్స్ పర్ట్స్  అంటున్నారు.

హైకోర్టు పై సుప్రీంకు వెళ్లాలని నిర్ణయం

కరోనా కట్టడి విషయంలో హైకోర్టుతీర్పుపై సుప్రీం కువెళ్లాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.   ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు.. ఎక్కువ టెస్టులు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించింది. ఎంత మంది శాంపిల్స్ సేకరించారు? ఎంత మందికి పాజిటివ్ ఉంది? ఎంత మంది క్వారంటైన్లో ఉన్నారు? ఎంత మందిసెకండరీ  కాంటాక్ట్ లో ఉన్నారు? తదితర విషయాలను వైబ్ సైట్ లో పె ట్టాలంది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకు వెళ్లేందుకు రెడీ అయింది. దీనిపై హైకోర్టు కామెంట్ చేస్తూ …‘‘ఎక్కువ టెస్టులు చేయాలని చెప్పినా ఎందుకు పట్టించుకో వట్లే. ఆఫీసర్లపై  కోర్టుధిక్కరణ చర్యలు తీసుకుంటాం’’అని హెచ్చరించింది. హైకోర్టు చెప్పినట్టుగా టెస్టులు చేసుకుంటూ పోతే ఆఫీసర్లు ఇతర పనులు చేయలేరని ప్రభుత్వంప్రకటించింది.

పారాసిటమాల్ గోలీ చాలని చెప్పి..!

కరోనా దేశంలోకి ప్రవేశించిన టైంలో రాష్ట్రంలో అసెంబ్లీసమావేశాలు జరుగుతున్నాయి. మార్చి 7న కరోనాపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడతూ.. వైరస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నా రు. ‘ జస్ట్ పారా సిటమాల్ గోలీ వేసుకుంటే చాలు. అంతుకు మించి ఏమీ అక్కర్లేదు లే వైరస్ 22 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే బతకనే బతకదు. అందరూ మాస్క్ లు పెట్టుకోవాలని అంటున్నారు. మాస్క్ లు పెట్టుకోకుంటే సచ్చిపోతమా?’’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలోనూ కేసీఆర్.. ‘‘మాస్కులేకపోతే చస్తమా? చేతి రుమాలు ఉంటే చాలు, మేం అందరం మాస్కులే పెట్టుకుంటున్నమా?”అని ప్రశ్నించారు. మాస్కులు మార్కెట్ లో లేవని మీడియా అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో ఆయన సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మాస్క్ లు ధరించడం తప్ప
నిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ‘‘మాస్కులు వేసుకోకుంటే రూ. 1000 జరిమానా విధిస్తం. మాస్క్ లేకపోతే షాపుల్లోకి  అనుమతి ఇవ్వరు. నో మాస్క్ నో గ్రోసరీ’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఎవరో చేస్తే మేం ఎందుకు చేయాలి: సీఎం

ఎక్కువ టెస్టు లు ఎందుకు చేయడంలేదని, పొరుగు రాష్ట్రాల్లో ఎక్కువ టెస్టు లు చేస్తున్నారని కొన్ని రోజుల క్రితం మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ‘‘ఎవరో ఎక్కువ టెస్టు లు చేస్తే మేమెందుకు చేయాలి? ఎవరికి టెస్ట్ చేయాలో.. ఎప్పుడు చేయాలో మాకు తెలుసు’’ అని అన్నారు. ప్రైవేటు లో టెస్టు లకు ఎప్పుడు అనుమతి ఇస్తారని అడిగితే ‘‘ప్రైవేట్‌లో టెస్టు లు చేయొద్దని నేనే
చెప్పిన.. ఇది భయకంరమైన బీమారీ.. గవర్నమెంట్‌ దగ్గర రోజుకు వెయ్యి టెస్టు లు చేసే కెపాసిటీ ఉంది’’ అని పేర్కొన్నారు

ఎక్కువ టెస్టు లు చేస్తే ప్రైజులు ఇస్తరా: కేటీఆర్

ఎక్కువ టెస్టు లు ఎందుకు చేయడం లేదని కొన్నిరోజుల క్రితం మంత్రి కేటీఆర్ ను అడిగితే.. ‘‘ఎక్కువ టెస్టు లు చేస్తే ఏమైనా ప్రైజులు
ఇస్తరా? ఎందుకు ఎక్కువ చేసుడు? గైడ్ లైన్స్ ఎట్లుంటే అట్లనే చేస్తం’’ అని అన్సర్ ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కువ చేస్తే మనమెందుకు చేయాలన్నారు.

ఎమ్మెల్యేలకు రావడంతో అలర్ట్

రెండు మూడురోజులుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు. ముందుగా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ , బిగాల గణేష్ గుప్తాకు వైరస్ సోకింది. అంత కుముందు మంత్రి హరీశ్రావు పీఏ, గ్రేటర్
హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్  డ్రైవర్ కు పాజిటివ్ అని తేలింది. మంత్రులు, ఎమ్మెల్యే లు ఆందోళన చెందారు. మంత్రి
హరీశ్రావు హోం క్వారంటైన్ ఉన్నారు. సీఎంవో ఆఫీసర్లు వైరస్ బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వం అలర్ట్అయింది. ఇన్నా ళ్లూ టెస్టులు ఎక్కువ చేయాలని ప్రజలు,ప్రతిపక్షాలు ఒత్తిడి చేసినా స్పందించని ప్రభుత్వం..దిగివచ్చింది. గ్రేటర్ పరిధిలో 50 వేల టెస్టులు చేయించనున్నట్లు ప్రకటించింది