కరోనా వ్యాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు: డేవిడ్ నబర్రో

కరోనా వ్యాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు: డేవిడ్ నబర్రో

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడతుంటే… ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ప్రయోగశాలల్లో ఇప్పటికే 100 వరకు వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ క్రమంలో WHO కొవిడ్-19 ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ డేవిడ్ నబర్రో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చన్నారు. చాలా రకాల వైరస్ లకు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదని, కరోనా విషయంలోనూ అదే జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు దాదాపు లేవని స్పష్టం చేశారు. జరుగుతున్న ప్రయోగాల కారణంగా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నా…చివరిగా అన్నీ ఈ వైరస్ ను కట్టడి చేయడంలో ఫెయిల్ అవుతున్నాయన్నారు డాక్టర్ నబర్రో.