
కరోనా వైరస్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్ట్ లు పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధనలకు అనుగుణంగా వైరస్ ప్రభావం గురించి వివరిస్తున్నారు. తాజాగా సైంటిస్ట్ ల పరిశోధనల్లో కరోనా వైరస్ రాబోయే రోజుల్లో సీజనల్ వ్యాధిగా మారే అవకాశం ఉందని లెబనాన్‌లోని అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బీరుట్ సైంటిస్ట్ లు తేల్చారు. అయితే ఇమ్యూనిటీ పవర్ ఉన్నవాళ్లకి వైరస్ సోకదని మీడియా సంస్థ ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ తన కథనంలో ప్రస్తావించింది. ఇన్‌ఫ్లుయెంజా, ఫ్లూ వైరస్‌లతో పోలిస్తే కరోనా ఎక్కువగా వ్యాపిస్తుందని గుర్తించారు. వాటిలాగా, కరోనా వ్యాప్తికి కాలంతో సంబంధం లేదని తేల్చారు. అయితే, టీకాల ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చాక కరోనా వ్యాప్తి గణనీయంగా పడిపోతుందని గుర్తించారు.