కార్పొరేట్ ట్యాక్స్ కోత మంచిదే

కార్పొరేట్ ట్యాక్స్ కోత మంచిదే

పెట్టుబడులు పెరుగుతాయన్న ఐఎంఎఫ్‌‌

వాషింగ్టన్ : కార్పొరేట్ ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్‌‌) అభినందించింది.  ఈ నిర్ణయం పెట్టుబడులపై సానుకూల ప్రభావాన్ని చూపనుందని పేర్కొంది. ‘ఇండియా ఇంకా పరిమితమైన ఆర్థిక స్పేస్‌‌లోనే ఉందని మేము నమ్ముతున్నాం. కాబట్టి చాలా కేర్‌‌‌‌ఫుల్‌‌గా ఉండాలి. పెట్టుబడులపై సానుకూల ప్రభావం చూపనున్న కార్పొరేట్ ఇన్‌‌కమ్ ట్యాక్స్ కోతను మేము సపోర్ట్ చేస్తున్నాం’ అని ఐఎంఎఫ్‌‌ ఆసియా, పసిఫిక్ డిపార్ట్‌‌మెంట్ డైరెక్టర్ ఛాంగ్యోంగ్ రీ చెప్పారు.

ఇండియాలో గత రెండు క్వార్టర్లలో కూడా స్లోడౌనే నమోదైందని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 6.1 శాతానికి పెరగనుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 2020లో ఇది 7.0 వరకు పెరుగుతుందని పేర్కొన్నారు. ఎన్​బీఎస్​ఫీ ‌‌‌‌సమస్యలను ఇండియా పరిష్కరించాలని ఐఎంఎఫ్  సీనియర్​ ఆఫీసర్​ మేరి గుల్డే అన్నారు.