బీజేపీలో చేరిన కార్పొరేటర్‌ అభినవ్‌ భాస్కర్‌

బీజేపీలో చేరిన కార్పొరేటర్‌ అభినవ్‌ భాస్కర్‌

వరంగల్, వెలుగు : వరంగల్‌ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్న కొడుకు, 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్‌ భాస్కర్‌ గురువారం బీజేపీలో చేరారు. మాజీ మంత్రి ప్రణయ్‌ భాస్కర్ కుమారుడైన అభినవ్‌ బీఆర్‌ఎస్‌తో పాటు, తన బాబాయి వినయ్‌ భాస్కర్‌ వ్యవహార శైలి నచ్చక పార్టీని వీడుతున్నట్లు బుధవారమే ప్రకటించారు.

గురువారం ఢిల్లీ వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.