ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదాద్రి జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో పత్తి సాగు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఇటీవల కురుస్తున్న వానలతో పత్తికి జీవం పోసినట్లైంది. సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదట్లోనే విత్తనాలు వేయడానికి రెండు సార్లు, కలుపు తీయడానికి ఒకసారి పెట్టుబడి పెట్టిన రైతులకు ఇప్పుడు కురుస్తున్న వానలతో గండం గట్టెక్కినట్లేనని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో గతంతో పోలిస్తే ప్రస్తుతం పత్తి సాగు తగ్గింది. గతేడాది 1.22 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగగా, ఈ సారి 1.10 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదట్లో విత్తనాలు వేసిన తర్వాత వానలు పడకపోవడంతో భూమిలోనే మాడిపోయాయి. దీంతో రైతులు మరోసారి విత్తనాలు వేశారు. ఆ తర్వాత వరుసగా వానలు పడడంతో చేన్లలో నీరు నిలిచి కలుపు పెరిగింది. దీనిని తొలగించేందుకు కూలీల కొరత ఏర్పడడంతో వారు అడిగినంత ఇచ్చి కలుపును తొలగించాల్సి వచ్చింది. ఈ కారణాలతో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే రైతులు మూడుసార్లు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ వానలు పడకపోవడంతో పత్తి రైతులు ఆందోళనకు గురయ్యారు. పెట్టిన పెట్టుబడులైనా వస్తాయా ? లేవా అని దిగులు పడ్డారు. ఈ టైంలో ఇటీవల వానలు పడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

సాధారణాన్ని మించి పడిన వాన

యాదాద్రి జిల్లాలో ఆదివారం అక్కడడక్కడ మోస్తారు వాన కురిసింది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షాపాతాన్ని మించి వాన పడింది. ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఆగస్టు 4 వరకు సాధారణ వర్షపాతం 415.4 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా, 621.8 మిల్లీ మీటర్ల వాన కురిసింది. 

లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికవరీలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు

మునగాల, వెలుగు : స్త్రీనిధి లోన్ల రికవరీలో నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని సూర్యాపేట డీఆర్డీఏ పీడీ కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు. ఆదివారం మునగాలలో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. రికవరీ వివరాలను ఎప్పటికప్పుడు గ్రామాల వారీగా తెలియజేయాలని ఆదేశించారు. కాగా సమావేశానికి హాజరుకాని తాడ్వాయి, జగన్నాథపురం, రేపాల వీవోఏలకు నోటీలు ఇవ్వాలని ఏపీఎంకు సూచించారు. ఈ నెల 5 నుంచి 9 వరకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఓటరు నమోదు, తొలగింపులు, సవరణ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని సూచించారు. సమావేశంలో ఏపీఎం నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

అనుమానాస్పదంగా వృద్ధురాలు మృతి

మిర్యాలగూడ, వెలుగు : అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు చనిపోయింది. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం జరిగింది.  వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని తాళ్లగడ్డకు చెందిన పరకాల సత్తెమ్మ (65) శనివారం రాత్రి తన ఇంట్లో పడుకుంది. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించగా సత్తెమ్మ చనిపోయి కనిపించింది. పక్కనే రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. సత్తెమ్మ ఒంటిపై ఉన్న నగలు మాయం కావడంతో పాటు, బాడీపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి

చండూరు (మర్రిగూడ), వెలుగు : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న చర్లగూడెం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాసితులకు న్యాయం చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద చేస్తున్న నిరాహార దీక్షలకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. నిర్వాసితులకు న్యాయం చేయకపోతే వారి తరఫున ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాసితులకు ఒక న్యాయం, చర్లగూడెం నిర్వాసితులకు మరో న్యాయమా ? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హామీలను అమలు చేయకుండా సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఎంపీటీసీలను కొనుగోలు చేస్తూ ప్రజ్వాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలను పట్టించుకోని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పక్క రాష్ట్రాల్లో డబ్బులు పంచడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. ఆయన వెంట ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముద్దం నరసింహ, మెండు దీపికారెడ్డి ఉన్నారు.

‘ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి’

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఎంపీ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి మతి భ్రమించిందని, అందుకే టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ల క్రితం ఆర్టీసీ బస్సులో తిరిగిన ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇప్పుడు వేల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలన్నారు. పేకాట క్లబ్బులు, మట్టి, ఇసుక వ్యాపారాలతో కోట్ల గడించారని ఆరోపించారు. కార్యకర్తలను కాదని టికెట్లు అమ్ముకొని రెండు నియోజకవర్గాల్లో పార్టీ లేకుండా చేశారన్నారు. ప్లాట్లను డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించి ఓనర్లను మోసం చేశారన్నారు. సూర్యాపేట వద్ద కారు ప్రమాదంలో కాలిపోయిన డబ్బులు ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిదేనన్నారు. 25 ఏళ్లుగా కోదాడ, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన అభివృద్ధి ఏమీ లేదన్నారు. హౌజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండి నియోజకవర్గంలో ఎన్ని ఇండ్లు కట్టించాడో చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. పులిచింతల పునరావాస కేంద్రాల ఏర్పాటు, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదర్శ కాలనీలో జరిగిన అవకతవకలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. తన స్వప్రయోజనాల కోసమే ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో నిర్మిచారన్నారు. సమావేశంలో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, అట్లూరి హరిబాబు, అమర్నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, అమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేసిన వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేలం

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సోమవారం వేలం వేయనున్నట్లు సీఐ తిరుపతిరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు, నాలుగు టూ వీలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూర్యాపేట ఎక్సైజ్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేలం పాట నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆసక్తి కలిగిన వారు ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంప్రదించాలని సూచించారు.

సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

హాలియా, వెలుగు : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 1,75,1239 క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో వస్తుండడంతో సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16 గేట్లను ఎత్తి 1,28,432 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి స్థాయి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.30 అడుగుల మేర నీరు ఉంది. సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కుడికాల్వకు 8,981 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6,634, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీకి 1,800, వరదకాల్వకు 400, మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 29,476  క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

నిమజ్జన యాత్రకు ఏర్పాట్లు పూర్తి

కోదాడ, వెలుగు : గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిమజ్జన టైంలో ప్రతి ఒక్కరూ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించాలని సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. ఆదివారం కోదాడలో నిర్వహించిన పీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండపాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, ప్రజలంతా ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. శోభాయాత్ర, నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నిర్వాహకులు రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పనిసరిగా పాటించాలని, తమకు కేటాయించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం చేసుకోవాలని సూచించారు.   కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సీఐలు శివశంకర్, ఆంజనేయులు, ప్రసాద్ పాల్గొన్నారు.

ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

మునుగోడు, వెలుగు : తెలంగాణ ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లిలో ఆదివారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. ఉద్యమకారులకు సంక్షేమ బోర్డుతో పాటు, ప్రతి ఉద్యమకారునికి 350 గజాల ఇంటి స్థలం, హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఉద్యమకారుల తరఫున త్వరలో మునుగోడులో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీమ శ్రీనివాస్, కార్యదర్శి సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఉమ్మడి నల్గొండ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనంతుల మధు, కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవి, అధ్యక్షుడు శ్రీనివాస్, జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయన్న, తోట నరసింహాచారి, మునుగోడు నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కట్ట సైదులు, అద్దంకి రవీందర్ పాల్గొన్నారు.

దివ్యాంగుడికి ఆర్థికసాయం

నేరేడుచర్ల, వెలుగు : సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన భీమిశెట్టి రవి కుమారుడు, దివ్యాంగుడు శ్రీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చేలా కృషి చేస్తానని టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ రాష్ట్ర నాయకుడు జిన్నారెడ్డి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన శ్రీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరామర్శించారు. టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాబ్లమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగానే శ్రీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాలేదని 
ఆఫీసర్లతో మాట్లాడుతానని చెప్పారు. అనంతరం రూ. 10 వేల ఆర్థికసాయం అందజేశారు. ఆయన వెంట క్రాంతి నికేతన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వచ్చంధ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుంకర క్రాంతికుమార్, మాజీ సర్పంచ్ ఆకారపు వెంకటేశ్వర్లు, జింకల భాస్కర్, జంపాల శ్రవణ్, యారవ సురేష్, గుండా సత్యనారాయణ, సైదులు, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

మున్నూరుకాపులంతా ఐక్యంగా ఉండాలి

సూర్యాపేట, వెలుగు : మున్నూరుకాపు సంఘ సభ్యులంతా ఐక్యమత్యంతో ఉండి, సమస్యలను పరిష్కరించుకోవాలని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతి విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు సూచించారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. మున్నూరుకాపుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో నాయకులు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రాజా, జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మొరగండ్ల లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, సీతయ్య, గాలి శ్రీనివాస్, దాచేపల్లి శీను, ధనుంజయనాయుడు, ఎలిమినేటి అభినయ్ పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసే టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరుతున్రు

యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే చాలా మంది పార్టీలో చేరుతున్నారని డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొంగిడి మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన పలువురు నాయకులు ఆదివారం టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. వారికి గొంగిడి మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృషి చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూడలేకే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డమీది రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆలేరు పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ధ్యేయం

హాలియా, వెలుగు: పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం పనిచేస్తోందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే నోముల భగత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్సీ కోటిరెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ, తిరుమలగిరి పరిధిలోని పలువురికి మంజూరైన ఆసరా గుర్తింపుకార్డులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగి పెద్దులు, ఎంపీపీ ఆంగోతు భగవాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయక్, జడ్పీటీసీ ఆంగోతు సూర్యభాష్యానాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండునాయక్​, నందికొండ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్ణ అనూష శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రఘువీర్, కమిషనర్ రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. 

వేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్య

హాలియా, వెలుగు : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కృష్ణా నదిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగింది. విజయపురి టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని నర్సరావుపేట జిల్లా కారంపూడి మండలం నరమలపాడుకు చెందిన గొలుసు శివయ్య (33) ఆరు నెలలుగా భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటూ కూలి పనికి వెళ్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడంతో మనస్థాపానికి గురైన శివయ్య సొంత గ్రామానికి వెళ్లొస్తానని చెప్పి రెండు రోజుల కింద బయటకు వచ్చాడు. తర్వాత నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన అతడు కొత్త బ్రిడ్జి వద్ద బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వదిలేసి నదిలో దూకాడు. శనివారం రాత్రి నది ఒడ్డున శవాన్ని గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి భార్య శివ పార్వతి ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కూతురు కాపురంలో గొడవలు జరుగుతున్నాయని...

కూతురు కాపురంలో గొడవలు జరుగుతున్నాయన్న మనస్థాపంతో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పాల్తితండాలో ఆదివారం జరిగింది. తండాకు చెందిన పాల్తి హునా (56) తన కూతురు శాంతిని అదే తండాకు చెందిన డేగావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగుకు ఇచ్చి వివాహం చేశాడు. ఇద్దరు మధ్య గొడవలు జరగడంతో శాంతి 15 రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. శనివారం శాంతిని అత్తింట్లో దింపేందుకు హునా వెళ్లాడు. అక్కడ అతడి అల్లుడు నాగు, ఆయన తమ్ముళ్లు కలిసి హునాతో గొడవపడి కొట్టారు. కూతురు కాపురంలో గొడవలు జరగడంతో పాడు అల్లుడు కొట్టడంతో మనస్తాపానికి గురైన హునా ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.