హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డెంటల్ కాలేజీల్లోని బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల అడ్మిషన్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కాళోజీ హెల్త్ వర్సిటీ వెల్లడించింది. శనివారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 6 ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆప్షన్లు పెట్టుకోవాలని వర్సిటీ అధికారులు తెలిపారు. కన్వీనర్ కోటాతోపాటు తర్వాత జరిపే కౌన్సెలింగ్‌లో కూడా ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. వివరాలకు వెబ్‌సైట్ https:/tsbdsadm.tsche.in, www.knruhs.telangana.gov.in లో చూడాలన్నారు.
