
హైదరాబాద్, వెలుగు: ప్రీమియం నాటుకోడి మాంసం అమ్మే కంట్రీ చికెన్ కో సిటీలో 3వ ప్రీమియం అవుట్‌లెట్‌ను గురువారం కొత్తపేటలో మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. నాటుకోళ్లను తమ ఫారమ్‌లలో 4 నుండి 36 నెలల వరకు పెంచుతామని, ఈ చికెన్‌లో మంచి ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయని కంట్రీ చికెన్ కో పేర్కొంది.
ఈ కోళ్లలో కొవ్వు తక్కువగా ఉంటుందని వివరించింది. అంతేగాక వీటిని పొలాలలో బహిరంగంగా తిప్పడం వల్ల సహజంగా పెరుగుతాయని, ఇలాంటి కోళ్ల మాంసం రుచి చాలా బాగుంటుందని సంస్థ ఫౌండర్ సాయికేశ్ గౌడ్ చెప్పారు. గ్రోత్ హార్మోన్లు & యాంటీబయాటిక్స్‌ను ఇవ్వబోమని అన్నారు. తాము మొత్తం ఐదు రకాల నాటు కోళ్లను అమ్ముతామని చెప్పారు.