
- ఆర్థిక ఇబ్బందులతో గొడవపడి అఘాయిత్యం
- కామారెడ్డి జిల్లాలో ఘటన
కామారెడ్డి, వెలుగు : గొడవపడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. లింగంపేట మండలం కొల్పోల్కు చెందిన చాకలి సుజాత(33), గంగారాం(38), దంపతులకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్యాభర్తలు కూలీ పనులు చేస్తుంటారు. నెల రోజుల కింద రాజంపేట మండలం శివాయిపల్లికి చెందిన ప్రభాకర్‌రావు వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి అక్కడే కూలీ పనులు చేసుకుంటూ ఉంటున్నారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా గొడవపడుతుంటే సుజాత అన్న భూమయ్య వెళ్లి సర్దిచెప్పేవాడు. గత నెల 29న భార్యభర్తలు మరోసారి గొడవపడి ఆవేశంలో గడ్డిమందు తాగారు. ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లగా కొడుకు రాంచరణ్తన మామ భూమయ్యకు ఫోన్‌చేసి చెప్పాడు. ఆయనతో పాటు భూమి యజమాని వెళ్లి.. దంపతులను అంబులెన్స్‌లో చికిత్స కోసం కామారెడ్డి ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన ట్రీట్ మెంట్ కోసం నిజామాబాద్ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం సుజాత, మంగళవారం గంగారాం చనిపోయారు. బంధువు భూమయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.