ఛీ.. వీళ్లు తల్లిదండ్రులేనా... రీల్స్ కోసం బిడ్డను అమ్ముకున్నారు

ఛీ.. వీళ్లు తల్లిదండ్రులేనా... రీల్స్ కోసం బిడ్డను అమ్ముకున్నారు

పిల్లలు లేని దంపతులు ఎన్నో ఆసుపత్రులు తిరిగి మాతృ స్పర్శ కోసం ఎంతైనా డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక తమ పిల్లలకు తమ ఆస్తులను అవసరమైతే తమ శరీర భాగాలను ఇచ్చే తల్లిదండ్రులు సమాజంలో కోకొల్లలు. అయితే ఓ దంపతులు మాత్రం రీల్స్ చేయడం  కోసం ఏకంగా  కొడుకునే అమ్ముకున్నారు. వచ్చిన డబ్బుతో ఐ ఫోన్ కొనుక్కొని రీల్స్ చేస్తూ ఎంజాయి చేస్తున్నారు.  తరా  కొడుకును అమ్మిన విషయం పోలీసులకు తెలియడంతో కటకటాల పాలయ్యాడు.

తాము ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నా సరే.. తమ పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు తల్లిదండ్రులు. ముఖ్యంగా.. నెలలు నిండిన పిల్లల్నైతే ఈగ కూడా వాలకుండా ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. తమ ఆకలి, ఇష్టాలు, కోరికల్ని చంపుకొని మరీ పిల్లల్ని పోషిస్తారు. పూట గడవడానికి కష్టంగా ఉన్నా సరే.. పిల్లలే ప్రాణంగా బతుకుతుంటారు. కానీ.. వెస్ట్ బెంగాల్‌లోని ఓ జంట అందుకు భిన్నంగా ఏం చేశారో తెలుసా? కేవలం ఐఫోన్ కోసమని తమ 8 నెలల కన్నకొడుకుని అమ్మేశారు. ఆ ఫోన్ కూడా ఎందుకు తీసుకున్నారనుకుంటున్నారు? రీల్స్ చేయడం కోసం! అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.

పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లా పానిహతిలోని గాంధీనగర్ కు చెందిన జయదేవ్, సాథి దంపతులకు ఏడేళ్ల కుమార్తె, 8 నెలల కుమారుడు ఉన్నారు. వీరు సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీ సంపాదించుకోవాలని అనుకున్నారు. అందరిలాగే రీల్స్ చేయాలని కలలు కన్నారు. అయితే వారి వద్ద స్మార్ట్ ఫోన్ లేదు. దాన్ని కొనేందుకు డబ్బు కోసం కన్న కొడుకుని అమ్మకానికి పెట్టారు. ఎనిమిది నెలల కుమారుడిని రూ.2 లక్షలకు విక్రయించారు. ఆ వచ్చిన డబ్బుతో ఓ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా, సముద్ర తీరాలు సహా అనేక ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో రీల్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేవారు.

రోజురోజుకూ మానవత్వం మంట కలుస్తోంది. తాము కన్నవాళ్లు, తమను కన్నవాళ్ల కంటే కూడా వస్తువులపై మోజు పెరిగిపోతుంది. ఇంట్లో వాళ్లు చూపించే ప్రేమ కంటే సామాజిక మాధ్యమాల్లో వచ్చే లైకులు, కామెంట్లు, షేర్లే ముఖ్యమనుకునే వాళ్లు కోకల్లలు. అలాంటి కోవలోకే వస్తుందీ జంట. ఆ దంపతులకు రీల్స్ అంటే మోజు. అవి చేసేందుకు తమ వద్ద మంచి ఫోన్ లేదు. ఐఫోన్ కొనాలని ఎంతో కాలంగా చూస్తున్నారు. కానీ అందుకు తమ వద్ద డబ్బు లేదు. ఈక్రమంలోనే తమ 8 నెలల కుమారుడిని అమ్మేస్తే డబ్బులు వస్తాయని.. వాటితో ఐఫోన్ కొని ఫుల్లుగా రీల్స్ చేసుకోవచ్చని ప్లాన్ వేశారు. వెంటనే బాబును అమ్మేసి ఫోన్ కొన్నారు. తల్లి ఒడిలో కూర్చొని ఆడుకోవాల్సిన ఆ బాబును వెంటనే మర్చిపోయిన ఆ తల్లిదండ్రులు... ఎంచక్కా రాష్ట్రమంతా తిరుగుతూ రీల్స్ చేసుకుంటున్నారు. 

AsloRead: లక్కీ భాస్కర్గా దుల్కర్.. శిఖరాలకు చేరిన సాధారణ మనిషి కథ

ఐఫోన్ వచ్చినప్పటి నుంచి వీరి  బాబు కనిపించకపోవడాన్ని స్థానికులు గమనించారు. దీంతో వాళ్లు ఉండలేక.. ఆ జంటని నిలదీశారు. మీ 8 నెలల బాబు ఏమయ్యాడు? కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు  అని అడిగారు. అందుకు ఆ జంట.. పొంతన లేని సమాధానాలు చెబుతూనే ఎప్పుడూ ఊర్ల చుట్టూ తిరుగుతున్నారు. దానికి తోడు రీల్స్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వీరి వ్యవహారం తేడాగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జయదేవ్, సాథిని విచారించారు. ఈక్రమంలోనే ఐఫోన్ కొనడం కోసం డబ్బుల్లేక బాబును అమ్ముకున్నట్లు తెలిపారు. ఈ మాట విన్న పోలీసులు నిర్ఘాంతపోయారు.