
- ముగ్గురితో పాటు ఆర్ఐని అరెస్ట్ చేసిన ఇచ్చోడ పోలీసులు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్జిల్లాలో ఫేక్ డాక్యుమెంట్ల కేసులు నమోదు కాగా.. తాజాగా దంపతుల ఓట్లను సైతం మార్చేసిన ఘటనలో నలుగురు అరెస్ట్ అయ్యారు. సీఐ బి. రాజు తెలిపిన ప్రకారం.. ఇచ్చోడ మండలం ఆడేగం బి గ్రామానికి చెందిన కదం వనిత, సుభాష్ దంపతుల ఓట్లను ఫోర్జరీ సంతకాలు చేసి ఇచ్చోడకు మార్చేశారు.
తహసీల్దార్ సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయగా గురువారం నిందితులు కదం విశాల్, సిందే అచ్యుత్, కదం ధన్ రాజ్ ను అరెస్టు చేశారు. ఫేక్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ సృష్టించి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో అప్లై చేసి రెవెన్యూ అధికారుల సాయంతో దంపతుల ఓట్లను
ఇచ్చోడకు మార్చారు. ఇందుకు సహకరించిన రెవెన్యూ ఇన్ స్పెక్టర్ హుస్సేన్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.