గర్భంతో ఉన్నప్పుడు ఎలా ఉండాలో కోర్స్

గర్భంతో ఉన్నప్పుడు ఎలా ఉండాలో కోర్స్

ఉత్తర ప్రదేశ్‌‌‌‌లోని లక్నో యూనివర్సిటీ సరికొత్త కోర్సును లాంచ్‌‌‌‌ చేయబోతోంది. గర్భంతో ఉన్నప్పుడు మహిళలు ఎట్లుండాలి, ఎలాంటి బట్టలేసుకోవాలి, ఎలాంటి తిండి తినాలి, ఎలాంటి మ్యూజిక్‌‌‌‌ వినాలి, తనను తాను ఎట్ల ఫిట్‌‌‌‌గా ఉంచుకోవాలో చెప్పే 16 విలువలు నేర్పే కోర్సును ప్రారంభించబోతోంది. కోర్సులో భాగంగా మాతృత్వం గురించి వివరించనుంది. ‘గర్భ్‌‌‌‌ సంస్కార్‌‌‌‌’ పేరుతో తీసుకొస్తున్న ఈ డిప్లొమా కోర్సును ఆడ వారితో పాటు మగవారూ ఎంచుకోవచ్చని వర్సిటీ చెప్పింది. ‘గతేడాది వర్సిటీ కాన్వొకేషన్‌‌‌‌కు వచ్చిన గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ .. మహాభారతంలోని అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే యుద్ధ నైపుణ్యాలను నేర్చుకున్నారని చెప్పారు. ఆ టైంలోనే గర్భంతో ఉన్నప్పుడు మహిళలు ఎలా ఉండాలో కోర్సుగా చెబితే బాగుంటుందని ప్రతిపాదన తెచ్చారు. జర్మనీలోని ఓ వర్శిటీ ఇలాంటి కోర్సు ఉందని కూడా పేర్కొన్నారు’ అని వర్సిటీ పేర్కొంది.