కరోనాపై 78 శాతం పనిచేస్తున్న కొవాగ్జిన్

కరోనాపై 78 శాతం పనిచేస్తున్న కొవాగ్జిన్

కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ తమ కొవాగ్జిన్ ఫేజ్-3 ట్రయల్స్ ఫలితాలు విడుదల చేసింది. మొత్తంగా వ్యాక్సిన్ ఎఫికసి 78 శాతంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ఎఫికసి చూపించిందని తెలిపింది. సివియర్ సింప్టోమాటిక్ కరోనాపై అత్యధికంగా 93.4 శాతం ఎఫెక్ట్ చూపించిందని తెలిపింది. నవంబర్ 16, 2020 నుంచి జనవరి 7, 2021 మధ్య 25, 798 మంది ట్రయల్స్‌లో పాల్గొన్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్  మొత్తం 25 హాస్పిటల్స్‌లో జరిగాయని.. వ్యాక్సిన్ సంబంధిత మరణాలు ఒక్కటి కూడా నమోదు కాలేదని భారత్ బయోటెక్ తెలిపింది.