
కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో ఇవాళ(బుధవారం) ప్రారంభమయ్యాయి. యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ ట్రయల్స్‌లో మెదటి వాలంటీర్‌గా పేరును నవెూదు చేసుకున్నారు. కొవాగ్జిన్ ఫేజ్-3 ట్రయల్స్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. టీకాను పరీక్షించేందుకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. భారత్ బయోటెక్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది.