కవర్ స్టోరీ..గగన వీధుల్లోకి!

కవర్ స్టోరీ..గగన వీధుల్లోకి!

అంతరిక్షం అంటే.. అంత ఈజీ కాదు. అది ఎప్పటికీ అంతుచిక్కని రహస్యమే. దాన్ని తెలుసుకోవడానికి అక్కడిదాకా పోవడమే పెద్ద రిస్క్‌‌‌‌. అయినా.. భావి తరాల కోసం, అక్కడి విషయాలు తెలుసుకునేందుకు వెళ్తుంటారు. అయితే.. ఇప్పటికే చాలాసార్లు స్పేస్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి వచ్చిన అనుభవం ఉన్న  అమెరికా, రష్యా లాంటి దేశాలకు అది పెద్ద విషయమేమీ కాదు. కానీ.. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతరిక్షంలోకి మనుషుల్ని పంపడమంటే చాలా పెద్ద సక్సెస్‌‌‌‌‌‌‌‌ సాధించినట్టే. ఆ సక్సెస్‌‌‌‌‌‌‌‌ని తెచ్చిపెట్టేందుకే ఇప్పుడు నలుగురు ఆస్ట్రొనాట్లను సిద్ధం చేస్తోంది ఇస్రో. మిషన్‌‌‌‌‌‌‌‌ గగన్‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌తో వాళ్లు విజయం సాధిస్తే యావత్ భారతదేశం గెలిచినట్టే!  

గతంలో భారత వైమానిక దళానికి చెందిన రాకేశ్​శర్మ రష్యా నుంచి స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లొచ్చారు. కానీ.. మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత భారతీయులు అంతరిక్షం వైపు అడుగులు వేస్తున్నారు. అది సొంత టెక్నాలజీతోనే రాకెట్లు, క్రూ మాడ్యుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేసుకుని మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యారు. అయితే ఒకప్పటితో పోలిస్తే మనం ఇప్పుడు స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా ముందున్నాం.

పోయినేడాది ఆగస్ట్​ 23న ఇస్రో చేపట్టిన చంద్రయాన్–3 సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది. చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని దింపి ప్రపంచంలోనే మొదటి దేశంగా ఇండియా నిలిచింది. కొన్నేళ్ల నుంచి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)  సాధించిన విజయాలు మన దేశాన్ని అంతరిక్ష రంగంలో మరో మెట్టు ఎక్కించాయి.

మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంగళయాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని చేరి అన్ని దేశాల చూపుని ఇస్రో తనవైపు తిప్పుకుంది. ఒకే మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వందకు పైగా శాటిలైట్లను స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి పంపి రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ఈ మధ్య ఆదిత్య ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1ను భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది ఇస్రో. ఇప్పుడు గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మరో ఘనత సాధించడానికి రెడీ అయిపోయింది.

మొట్టమొదటి హ్యూమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్నీని మొదలుపెట్టేందుకు అన్నీ సిద్ధం చేస్తోంది. ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లబోతున్న నలుగురు భారత ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (వ్యోమగాములు)ని ప్రధాని ఫిబ్రవరి 27న జాతికి పరిచయం చేశారు. వాళ్లు... ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాలకృష్ణన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయర్, అంగద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతాప్, అజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణన్, వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుభాన్షు శుక్లా. 

సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలా? 

ఇస్రో ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఎలా సెలక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిందనే వివరాలను బయటకు చెప్పనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సెలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాదాపు ఒకేలా ఉంటాయి. మన దగ్గర ఈ సెలక్షన్ ప్రక్రియను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ భుజాన వేసింది ఇస్రో. ఇది 1957లో భారత వాయుసేనకు అనుబంధంగా ప్రారంభమైన సంస్థ. భారత వాయుసేన పైలట్లకు శిక్షణ ఇస్తుంటుంది. అందుకే అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల ఎంపిక బాధ్యతను కూడా ఈ సంస్థకే అప్పగించారు.

అర్హతలు

  •     అభ్యర్థులకు మెడిసిన్, జియాలజీ, ఫ్లయింగ్ లాంటి రంగాల్లో అనుభవం ఉండాలి. 
  •     దరఖాస్తు చేయడానికి కనీస వయసు 39  సంవత్సరాలు.
  •     ఇంజినీరింగ్ బ్యాక్ గ్రౌండ్ కచ్చితంగా ఉండాలి. 
  •     జెట్ విమానంలో సుమారు1,000 గంటలు ప్రయాణించిన అనుభవం ఉండాలి. 
  •     వీటితోపాటు అదనంగా ఇంటర్వ్యూలు ఉంటాయి. అభ్యర్థుల కంటి చూపు, రక్తపోటు, హార్ట్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి అన్ని వైద్య పరీక్షలు చేస్తారు. 
  •     శారీరక దృఢత్వ పరీక్షల్లో కూడా క్వాలిఫై కావాలి. 
  •     ఎత్తు కూడా ఇస్రో సూచించినంతే ఉండాలి. అలా ఉంటేనే స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాప్సూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌకర్యవంతంగా ఉండి, ఆపరేట్ చేయగలుగుతారు. 

ఈ అర్హతలన్నీ ఉన్నవాళ్ల దగ్గరనుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. అందుకోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ల విభాగంలో అంతర్గతంగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇలా వచ్చిన అప్లికేషన్లు పరిశీలించి వారిలో తగిన అర్హతలున్న వాళ్లను షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆ తర్వాత ప్రత్యేకమైన మెడికల్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేశారు. అందులో కూడా అర్హత సాధించినవాళ్లలో.. శారీరక సామర్థ్యాలు అంతరిక్ష ప్రయాణానికి తగినట్లుగా ఉన్నవాళ్లను సెలక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి, షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు. తర్వాత రెండో దశలో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాసైన వాళ్లకు ప్రైమరీ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తారు.

60 మంది నుంచి.. 

మన దగ్గర ఆస్ట్రొనాట్ల ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లలో 60 మంది మెడికల్ టెస్టులు పాసయ్యారు. వాళ్లలో చివరికి 12 మందిని ఆస్ట్రొనాట్ల ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం సెలక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆ తర్వాత అందులో నుంచి 10 మందిని షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్ చేసి, వాళ్లందరినీ మరిన్ని టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం మూడు విడతల్లో రష్యా పంపారు. ఆ తర్వాత వాళ్లలో నుంచి నలుగురిని సెలక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి పూర్తి స్థాయి ఆస్ట్రొనాట్ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.

ఇక్కడ ప్రైమరీ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఇచ్చి, తర్వాత రష్యా పంపారు. రష్యా అంతరిక్ష సంస్థ ‘రాస్కోస్మోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చివరి రౌండ్ ట్రైనింగ్ ఇచ్చింది. యూరిగగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11 నెలల పాటు కఠిన శిక్షణ ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం పూర్తయ్యేందుకు 18 నెలల నుండి రెండేండ్ల వరకు పడుతుంది.  

ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏం ఉంటుంది? 

గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్ ప్రోగ్రాంకి ఎంపికైన ఎయిర్ ఫోర్స్ పైలట్లు మూడేళ్లుగా ఇంటెన్సివ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో స్పేస్ షిప్ కంట్రోల్ చేయడంతో పాటు, సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందించాలి? అంతరిక్షంలో ఎలా గడపాలి? అనే అంశాల మీద శిక్షణ ఇచ్చారు. ఎలాంటి కొత్త స్పేస్ షిప్, ఫైటర్ జెట్ అయినా నడిపించగలిగేలా.. సేఫ్టీపై కూడా ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.

శిక్షణా నియమావళిలో థియరీ కోర్సులు, ఫిజికల్ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిమ్యులేటర్ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్లయిట్ సూట్ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఖ్యమైనవి. ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్రో, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఫ్యాకల్టీ నుండి 200 పైగా లెక్చర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారు. 75 ఫిజికల్ ట్రైనింగ్ సెషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు. మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోర్సు ఎవాల్యుయేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు రెండు ఫ్లయింగ్ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు (12 గంటలు) పూర్తి చేశారు.

ఆ తర్వాత 2020లో ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రష్యాలోని యూరీ గగారిన్ కాస్మొనాట్ ట్రైనింగ్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జెనరిక్ స్పేస్ ఫ్లయిట్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెసిఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నారు. ఇందులో స్పేస్ ఫ్లయిట్, ప్రొపల్షన్, ఏరోడైనమిక్స్, లాంచ్ వెహికల్స్, స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ గురించిన ప్రాథమిక అంశాలు ఉన్నాయి.

రికవరీ, సర్వైవల్ ట్రైనింగ్, యోగా, పారాబొలిక్ ఫ్లయిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా మైక్రో గ్రావిటీ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నారు. ఇందులో స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుంటున్నారు. మరో పక్క వీళ్లంతా బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఈ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యాక వాళ్లలో నుంచి ముగ్గురు పైలట్లను గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రయాణించడానికి ఎంపిక చేస్తారు. 

ఆస్ట్రొనాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలంటే.. 

అమెరికా వాళ్లు ‘ఆస్ట్రొనాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’, రష్యా వాళ్లు ‘కాస్మొనాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’, చైనా వాళ్లు ‘టైకోనాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’, మన దగ్గర ‘వ్యోమగామి’.. ఇలా ఏ పేరుతో పిలిచినా అందరికీ ఇచ్చేది దాదాపు ఒకే రకమైన ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కాకపోతే.. ఏజెన్సీలను బట్టి సిలబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొన్ని తేడాలు ఉంటాయి. కానీ.. అంతరిక్షంలో విహరించాలంటే.. కచ్చితంగా కఠినమైన ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోవాల్సిందే. మొదటి హ్యూమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వోస్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ –1 లో యూరి గగారిన్ ప్రయాణించినప్పటి నుంచి ఇప్పటి వరకు టెక్నాలజీలో ఎన్నో మార్పులు జరిగాయి. ఆ మార్పులకు అనుగుణంగా ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేస్తూ వచ్చారు.  
 
అంత ఈజీ కాదు

అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత గ్రావిటీ లేకపోవడం వల్ల భారీ పరికరాలను కూడా ఈజీగా తరలించొచ్చు అనుకుంటారు. కానీ.. అది అంత సులభమైన పని కాదు.  గురుత్వాకర్షణ తక్కువగా ఉన్నప్పుడు భారీ వస్తువులను కదిలిస్తున్నప్పుడు శరీరం కూడా కదులుతుంది. అలాంటప్పుడు బయటి శక్తి వస్తువుపై పని చేస్తే తప్ప వస్తువుని అనుకున్న డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కదిలించడం సాధ్యం కాదు. ఉదాహరణకు స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఒక పెద్ద కుర్చీ హ్యాంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బయటికి వచ్చినప్పుడు చేతితో పట్టుకుని దాని వేగాన్ని తగ్గించి, దారి మళ్లించడానికి చాలా స్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండాలి. ఆ స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేర్పిస్తారు. 

సర్వైవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

అంతరిక్షం అంటేనే ప్రమాదం. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షటిల్ తలుపు తడుతుందో తెలియదు. కాబట్టి ఎలాంటి ప్రమాదం జరిగినా బతికి బయటపడగలిగే సర్వైవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేర్చుకోవాల్సి ఉంటుంది.  ముఖ్యంగా లోయర్ ఎర్త్ ఆర్బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు చిన్న చిన్న మీటర్ల నుంచి పెద్ద పెద్ద ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు ఏది సమస్యను తెచ్చిపెడుతుందో తెలియదు.

కాబట్టి వాటన్నింటికీ సిద్ధంగా ఉండాలి. స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడే కాదు.. తిరిగి వచ్చేటప్పుడు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువే. అందుకే స్పేస్ ఏజెన్సీలు తమ సిబ్బందికి సేఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు చాలా కష్టపడతాయి. అయినప్పటికీ, ఏదో ఒక ముప్పు అవకాశం ఎప్పుడూ ఉంటుంది. తిరిగి వస్తున్న షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ప్రమాదకరమైన ప్రాంతంలో ల్యాండ్ చేస్తే అంతే సంగతులు. అందుకే ఎక్కడ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినా కొన్నాళ్లపాటు ప్రాణాలు కాపాడుకోవడానికి కావాల్సిన సర్వైవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలుసుకుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు తమ ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి నిర్జన ప్రదేశాల్లో కూడా ట్రైనింగ్ ఇస్తుంటాయి. 

అపోలో టైంలో నాసా లునార్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పనామా అడవుల్లో ఉంచి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. అంతెందుకు రిమోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లొకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయితే.. పెద్ద తొండలు (ఇగువానా) నుంచి రక్షించుకునే స్కిల్స్‌‌‌‌ కూడా ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి నేర్పించారు. రష్యన్ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ తమ కాస్మొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి నెవాడా ఎడారుల్లో ఎలా బతకాలి? రష్యాలోని అతిశీతలమైన అడవుల్లో ఎలా సర్వైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలి? అనే విషయాలు నేర్పిస్తుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కొన్నిసార్లు ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి మధ్యధరా సముద్రంలో కూడా ట్రైనింగ్ ఇస్తుంటుంది. అంతేకాదు.. స్పేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రతి ఒక్కరికి మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమర్జెన్సీలో ఏం చేయాలి? ప్రథమ చికిత్స ఎలా చేయాలనేది కచ్చితంగా నేర్పిస్తారు. 

టాయిలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

గతంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేసిన ‘టిమ్ పీక్’ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నన్ను చాలామంది ‘మీరు అంతరిక్షంలో బాత్రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఎలా వెళతారు?’’ అని అడుగుతుంటారు అని చెప్పాడు. వాస్తవానికి ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అలాగే ఇలాంటి విషయాలపై కూడా ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తారు.

అక్కడ గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల  ప్లంబింగ్ వాక్యూమ్ సక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీని వాడతారు. లేదంటే.. మానవవ్యర్థాలు స్వేచ్ఛగా తేలియాడుతుంటాయి. అందుకే స్పేస్​ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మరుగుదొడ్లు మూత్రం, మలాన్ని వెంటనే స్టోరేజీ ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోకి పీల్చుకుంటాయి. అయితే.. ఈ కమోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను వాడడం అంత తేలికైన పని కాదు. టాయిలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీట్ల పక్కన పొడవాటి గొట్టాలు ఉంటాయి. ఒక్కొక్కరికీ ఒక్కో గరాటు ఉంటుంది. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బిల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని యాక్టివేట్ చేసిన తర్వాతే టాయిలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్లాలి. కాబట్టి అందుకు కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తారు. నాసాలో దీనిపై ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడానికి ప్రత్యేకంగా ట్రైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాడు. 

మైక్రో గ్రావిటీలో...

జీరో గ్రావిటీలో ఉండడానికి అలవాటు పడేందుకు ముందుగా భూమ్మీద మైక్రో గ్రావిటీలో సర్వైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వాలి. అందుకే ప్రతి ఆస్ట్రొనాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(బరువు లేని తనం) ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఒక్కో శిక్షణ సంస్థ ఒక్కో రకమైన పద్ధతులు వాడుతుంటుంది. ఒక వ్యక్తికి బరువులేని అనుభూతి కలిగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ.. ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువగా న్యూట్రల్ బ్యూయాన్సీ పూల్స్ లేదంటే మైక్రో గ్రావిటీ ఫ్లయిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రావెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు. ఇందుకోసం జీరో గ్రావిటీ విమానాలు వాడుతుంటారు.

మనవాళ్లు ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్న రష్యాలోని యూరి గగారిన్ కాస్మొనాట్ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీరో గ్రావిటీ ట్రైనింగ్ ఇచ్చేందుకు MiG–15 UTI, Tupolev Tu–104, IL-76 MDK ఫ్లయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  వాడతారు. వీటిలో దాదాపు 400 క్యూబిక్ మీటర్ల ఖాళీ స్థలం ఉంటుంది. సాధారణంగా ఇలాంటి ఫ్లయిట్లను ‘ఒమిట్ కామెట్’ అని పిలుస్తుంటారు. ఈ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లయిట్స్ అన్నీ రష్యన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చకలోవిస్కీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి.

ఈ ఫ్లయిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోడలు చాలా మెత్తగా ఉంటాయి. మైక్రో గ్రావిటీలో మనిషి తేలియాడుతూ ఉంటాడు. అలాంటప్పుడు గోడలకు తగిలి గాయాలు కాకుండా ఉండేందుకు గోడలను మెత్తగా డిజైన్ చేశారు. నాసా మాత్రం వాళ్ల ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రైనింగ్ ఇచ్చేందుకు KC–135 విమానాలను వాడుతుంటుంది. ఇలాంటి విమానాలను పైలట్లు అలల (పారాబొలిక్) కదలికలు క్రియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేలా నడుపుతారు.

విమానం పైకి లేచి కిందికి వస్తున్నప్పుడు లోపల ఉన్న వ్యక్తులు దాదాపు 20 నుండి 25 సెకన్ల వరకు బరువులేని స్థితి ఫీలవుతారు. ఈ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నప్పుడు చాలామందికి వికారం కలుగుతుంది. నాసా 2004లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. వీటిలో మొదటిసారి ప్రయాణించే వాళ్లలో ప్రతి ముగ్గురిలో ఒకరు కచ్చితంగా వాంతి(ఒమిట్​) చేసుకుంటారు. అందుకే వీటిని ‘‘ఒమిట్ కామెట్స్” అని పిలుస్తుంటారు. 

నీటి అడుగున

అమెరికాలోని టెక్సాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న హ్యూస్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తుంటుంది నాసా(అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ). ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి దగ్గరలో భారీ ఇండోర్ పూల్ ఒకటి ఉంది. దాని లోతు 40 అడుగులు (12.1 మీటర్లు), పొడవు 202 అడుగులు (61.5 మీటర్లు), వెడల్పు 102 అడుగులు (31 మీటర్లు). అంటే.. ఇది ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ కంటే పెద్దది.

ఇందులో ఉండే నీళ్ల టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 82 నుండి 86 డిగ్రీల ఫారెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హీట్ (27 నుండి 30 డిగ్రీల సెల్సియస్) మధ్య ఉంటుంది. ఇందులోని నీటిని ప్రతిరోజూ మారుస్తారు. ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకే ఇంత పెద్ద పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయించారు. రష్యాలోని ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఇలాంటి పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. అక్కడ ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(బరువు లేని తనం) ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ చేస్తారు. ఈ నీళ్లలో తేలియాడుతుంటే అంతరిక్షంలో ఎలాగైతే తేలియాడతారో అచ్చం అలానే ఉంటుంది. చాలా రోజుల పాటు ఆస్ట్రొనాట్స్ ఇక్కడ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు. ఈ పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని న్యూట్రల్ బ్యూయాన్సీ లాబొరేటరీ(ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) అని పిలుస్తారు.
 

ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూబా సర్టిఫికెట్ పొందాలి. స్కూబా డైవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చినవాళ్లకే స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. సముద్రం మీద దిగుతున్నప్పుడు స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాప్సూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకోని ప్రమాదం జరిగితే తమను తాము కాపాడుకోవడానికి డైవింగ్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. స్కూబా డైవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చినవాళ్లకే స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూట్ వేసి ఈ భారీ పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దింపుతారు.

కానీ.. వాళ్ల సేఫ్టీ కోసం ప్రతి ట్రైనీకి ఇద్దరు సేఫ్టీ డైవర్లు ఎస్కార్ట్ చేస్తారు. అంతేకాదు.. కొన్నిసార్లు సోయుజ్ వ్యోమనౌక నమూనాను పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టి, స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూట్ వేసిన ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అందులోకి దింపుతారు. అక్కడ వాళ్లకు డాకింగ్ డ్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షిప్–రిపేరింగ్ లాంటి టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇస్తారు. వాటన్నింటినీ సరిగ్గా పూర్తి చేస్తేనే పూర్తి స్థాయి ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తిస్తారు. ఆస్ట్రొనాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గంటసేపు స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలంటే.. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరు నుండి ఎనిమిది గంటలు గడపాలి. అమెరికా రష్యాలే కాదు.. చైనా, జపాన్​, యూరోపియన్ స్పేస్ సెంటర్లు కూడా ఇలాంటి పూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నాయి.  

ఈత రావాల్సిందే.. 

ప్రతి ఆస్ట్రొనాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈత కొట్టడం తెలియాలి. ప్రైమరీ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఆస్ట్రొనాట్లకు స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేర్పిస్తారు. ఆ తర్వాత స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెడతారు. అందులో క్వాలిఫై అయితేనే తర్వాత ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి పంపుతారు. ఆస్ట్రొనాట్లు 25 మీటర్ల (82-అడుగుల) పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు పూర్తి పొడవులు ఆపకుండా ఈదాలి. అది కూడా టెన్నిస్ షూస్,127 కిలోల బరువు ఉండే ఫ్లయిట్ సూట్ వేసుకుని ఈ టాస్క్ చేయాలి. దీనికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆస్ట్రొనాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులు ఫ్రీస్టయిల్ స్ట్రోక్, బ్రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్, సైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్.. వీటిలో ఏదో ఒక పద్ధతిలో మాత్రమే ఈత కొట్టాలి. ఈ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేశాక తప్పనిసరిగా10 నిమిషాలు నీళ్లలోనే ఉండాలి. నేవీ–రన్ వాటర్ సర్వైవల్ ట్రైనింగ్ కోర్సు కూడా పూర్తి చేయాలి. అంటే.. రాఫ్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఎలా అమర్చాలి? రెస్క్యూ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఎలా కంట్రోల్ చేయాలి? అనేవి తెలుసుకోవాలి. 

*   *   *

అదే సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో...

భారతదేశపు మొట్టమొదటి హ్యూమన్ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగమైన నలుగురు ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రష్యాలోని యూరి గగారిన్ కాస్మొనాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(జీసీటీసీ)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శిక్షణ తీసుకున్నారు. ఇదే సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాకేష్ శర్మ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారు.1984లో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ. జీసీటీసీ రష్యా రాజధాని మాస్కోకు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి యూరి గగారిన్ పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. ఈ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ సిమ్యులేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో సహా హైటెక్ ట్రైనింగ్ ఫెసిలిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. పర్వతాలు, అడవులు, చిత్తడి నేలలు, ఎడారులు, సముద్రం లాంటి ల్యాండింగ్ పరిస్థితుల కోసం ఇక్కడ సర్వైవల్ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తారు.

రాకేష్​ @ హైదరాబాద్​

రాకేష్ శర్మ  పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పాటియాలాలో 1949 జనవరి 13న పుట్టారు. పుట్టింది పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అయినా శర్మ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చదువుకున్నారు. నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు. భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేశాడు. శర్మ 1970లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెస్ట్ పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేరాడు.

తర్వాత స్క్వాడ్రన్ లీడర్ స్థాయికి ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొందాడు. భారత వైమానిక దళం, సోవియట్ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి కార్యక్రమం ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోస్మోస్ స్పేస్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు1982లో సెలక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. రాకేష్​ శర్మ 1984 ఏప్రిల్3న కజక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బైకనూర్ కాస్మొడ్రోమ్ నుండి ప్రయోగించిన సోవియట్ రాకెట్ సోయుజ్ టీ–-11 లో ప్రయాణించాడు.

అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి భారతీయ పౌరుడు రాకేష్​ శర్మ. సోయుజ్ T–11 వ్యోమనౌకని ఇంటర్నేషనల్ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. షిప్ కమాండర్ యూరి మాలిషెవ్, ఫ్లయిట్ ఇంజనీర్ గెన్నాడి స్ట్రెకలోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు రాకేష్​ శర్మ కూడా సల్యుట్–7 ఆర్బిటల్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లాడు. ఆయన ఏడు రోజుల 21 గంటల 40 నిమిషాలు సల్యూట్–7లో గడిపాడు.

ఆ టైంలో వాళ్లు నలభై మూడు ప్రయోగాత్మక సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్వహించారు. శాస్త్రీయ, సాంకేతికత మీద స్టడీ చేశారు. ప్రధానంగా బయో-మెడిసిన్, రిమోట్ సెన్సింగ్ రంగాలపై శర్మ పని చేశాడు. క్రూ మెంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్కోలో అధికారులతో, అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీతో మాట్లాడారు. అప్పుడు ఇందిరా గాంధీ ‘‘అంతరిక్షం నుండి భారతదేశం ఎలా ఉంది?’’ అని శర్మను అడిగితే.. అతను ‘సారే జహాన్ సే అచ్ఛా’ (ప్రపంచంలో అత్యుత్తమమైనదిగా ఉంది) అని జవాబు ఇచ్చాడు. సోయుజ్–టీ-11 లో శర్మ ప్రయాణించడంతో భారతదేశం అంతరిక్షంలోకి మనిషిని పంపిన 14వ దేశంగా అవతరించింది. 

అంతరిక్షంలో మనవాళ్లు

ఇప్పటివరకు ఇండియా నుంచి మానవ సహిత స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్ ఒక్కటి కూడా చేపట్టలేదు. అయినా.. ఇండియన్స్ మాత్రం అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ పౌరుడు రాకేశ్​ శర్మ అయినప్పటికీ భారత సంతతికి చెందినవాళ్లు మరికొందరు వెళ్లారు. ఆ లెక్కన ఇప్పటివరకు మన దేశానికి చెందిన వాళ్లు మొత్తం నలుగురు అంతరిక్షంలోకి వెళ్లారు. 

కల్పనా చావ్లా : 1962 మార్చి 17న హర్యానాలోని కర్నాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుట్టారు.  పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా పొందిన తర్వాత1982లో అమెరికా వెళ్లారు.1984లో టెక్సాస్ యూనివర్సిటీ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. ఆ తర్వాత కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయం నుండి 1986లో రెండవ మాస్టర్స్ అందుకున్నారు.  

1988లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ చేశారు. ఆ తర్వాత నాసాలో చేరారు. చావ్లా1997 నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌19న అమెరికా నుంచి కొలంబియా ఫ్లయిట్ STS–87 ద్వారా  అంతరిక్షంలోకి వెళ్లారు. ఈమె అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ. అప్పటికే ఆమె అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. అయితే.. ఆమె పుట్టుకతో భారతీయురాలు.

కల్పన భూమి చుట్టూ 252 సార్లు 10.67 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించారు. అంతరిక్షంలో 376 గంటలు (15 రోజుల 16 గంటలు) గడిపారు. కల్పన 2003లో రెండో మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా కొలంబియా STS–107 ద్వారా స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లింది. తిరిగి వస్తుండగా భూమి వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేలిపోయింది. ఆమె మరణానంతరం ‘కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్’ లభించింది. ఆమె గౌరవార్థం ఎన్నో వీధులు, యూనివర్సిటీలు, సంస్థలకు ఆమె పేరు పెట్టారు. 

సునీత విలియమ్స్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  అమెరికాలోని మసాచుసెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుట్టి, పెరిగారు. న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, మసాచుసెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండే స్లోవేన్–అమెరికన్ ఉర్సులిన్ బోనీ (జలోకర్) పాండ్యా దంపతులకు పుట్టారు. విలియమ్స్ తండ్రి కుటుంబం గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మెహసానా జిల్లాలోని జులాసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందింది. ఈమె తల్లి కుటుంబం స్లోవేనియన్ సంతతికి చెందింది. ఈమె స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లిన రెండో భారత సంతతికి చెందిన వ్యక్తి. ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెడిషన్ 14/15, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెడిషన్ 32 / 33లో పనిచేశారు. ఈమె ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి  రెండో మహిళా కమాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. స్పేస్‌‌‌‌లో ఎక్కువకాలం ఉన్న మహిళా ఆస్ట్రొనాట్స్​లో ఒకరిగా సునీత రికార్డ్‌‌‌‌ సాధించారు. 

రాజా చారి :  పూర్తి పేరు రాజా జోన్ వూర్పుటూర్ చారి.  భారతదేశానికి చెందిన శ్రీనివాస్ వి.చారి, పెగ్గి ఎగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు1977 జూన్ 24న పుట్టారు. చారి అమెరికన్ టెస్ట్ పైలట్ చేస్తూ నాసాకు ఆస్ట్రొనాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంపికయ్యారు. మసాచుసెట్స్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చదువుకున్నారు. 2,000 కంటే ఎక్కువ విమాన ప్రయాణాలు చేసిన అనుభవం ఉంది. నాసా ఆస్ట్రొనాట్ గ్రూప్–22 కి 2017లో ఎంపికయ్యారు. స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రూ–3 మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. 

*   *   *

2007లోనే...

వాస్తవానికి అంతరిక్షంలోకి మన ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పంపాలనే ఆలోచన 2006లోనే మొదలైంది. ముందుగా ‘ఆర్బిటల్ వెహికల్’ అనే పేరుతో మొదలైంది. అంతరిక్షంలో ఒక వారం పాటు ఉంచగలిగేందుకు ఒక సాధారణ క్యాప్సూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారుచేయాలని 2007లో అనుకున్నారు. 2008 మార్చి నాటికి డిజైన్ ఖరారు చేశారు. ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టారు.

కానీ.. అప్పట్లో నిధుల కొరత వల్ల ప్రయోగాలు ఆగిపోయాయి. అంతేకాకుండా.. అప్పటి వరకూ ఇస్రో దగ్గరున్న జీఎస్ఎల్వీ రాకెట్లకు క్యాప్యూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తీసుకెళ్లగలిగే కెపాసిటీ లేదు. టన్నుల కొద్దీ బరువైన క్రూ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకెళ్లే క్రయోజనిక్ ఇంజిన్లు లేవు. కానీ.. 2014లో తయారు చేసిన జీఎస్ఎల్వీ మార్క్–2 తో ఆ సమస్య తీరిపోయింది. ఆ తర్వాత జీఎస్ఎల్వీ మార్క్–3 కి తీసుకొచ్చారు. చంద్రయాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2లో మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తీసుకెళ్లింది కూడా ఇదే. దాంతో గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు మళ్లీ అడుగులు పడ్డాయి. హ్యూమన్ స్పేస్ ఫ్లయిట్ ప్రోగ్రామ్ 2017లో మళ్లీ మొదలైంది.

2018 ఆగస్టు 15న ఎర్ర కోట నుంచి ప్రధాని చేసిన ప్రసంగంలో ‘‘త్వరలోనే భారత్ మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టబోతుంది” అని ప్రకటించారు. ఆ తర్వాత... ఈ గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్ కార్యక్రమానికి 10 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. తర్వాత ఇస్రో... హ్యూమన్ స్పేస్ ఫ్లయిట్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బెంగళూరులోని ఇస్రో హెడ్ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసింది.

ఇద్దరు లేదా ముగ్గురు భారతీయ ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పంపి ఏడు రోజులు స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచి తిరిగి తీసుకురావాలని ప్లాన్ చేసింది. అన్నీ అనుకూలిస్తే మొదటి క్రూడ్ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని డిసెంబర్–2021లో ప్రయోగించాలనే లక్ష్యంతో పనిచేశారు. ఇదే విషయాన్ని అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు కూడా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ క్రూ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2014 డిసెంబర్ 18న రెడీ చేసింది.

2019 మే నాటికి క్రూ మాడ్యూల్ రూపకల్పన పూర్తయింది. 2019లో ఆస్ట్రొనాట్ల ఎంపిక జరిగింది. ఈ బృందం అంతరిక్షానికి వెళ్లి, తిరిగి భూమ్మీదకు వచ్చే క్రూ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా రెడీ చేశారు. కానీ.. కరోనా, మరికొన్ని కారణాల వల్ల 2025కి వాయిదా పడింది. ప్రస్తుతం అంతా రెడీగా ఉంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీవో) స్పేస్-గ్రేడ్ ఫుడ్, క్రూ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్, రేడియేషన్, సేఫ్టీ, పారాచూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి వాటికి టెక్నాలజీ అందించింది.

*   *   *

మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

భూమికి400 కి.మీ ఎత్తులో ఉన్న కక్ష్యలోకి ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పంపి, వాళ్లను తిరిగి హిందూ మహాసముద్రంలో సేఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ల్యాండ్ చేయడం గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్యం. గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్ అనే పేరుని సంస్కృతం నుండి  తీసుకున్నారు. గగన అంటే ‘ఖగోళం’, యానా  అంటే ‘క్రాఫ్ట్’ అని అర్థం. ఈ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దాదాపు అంతా ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీనే వాడారు.

ఈ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముగ్గురు వ్యక్తులు ట్రావెల్ చేసే వీలుంటుంది. ఇస్రో నుంచి ప్రయోగించనున్న మొదటి మానవ సహిత స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇది. ఇందులో ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండేందుకు 5.3- మెట్రిక్ టన్నుల బరువుండే క్యాప్సూల్ ఉంది. ఇది భూమిని 400 కిలోమీటర్ల ఎత్తులో ఏడు రోజుల వరకు ముగ్గురు వ్యక్తులను కక్ష్యలో ఉంచగలుగుతుంది.

టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇస్రో గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఇప్పటికే కొన్ని ప్రయోగాలు చేసింది. అందులో భాగంగానే గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇస్రో ‘టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’(టీవీ–డీ1) ఎక్స్​పరిమెంట్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని శ్రీహరికోట నుంచి ఈ  టెస్ట్ చేసింది. ఇందులో సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిక్విడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా క్రూ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్రూ ఎస్కేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఇస్రో 4 టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేయాలి అనుకుంది. అందులో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(టీవీ–డీ1) మొదటిది. 2018లో ఇలాంటి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినప్పటికీ అది పూర్తి స్థాయిలో జరగలేదు.

కానీ.. 2023లో మాత్రం పూర్తిగా రెడీ చేసిన క్రూ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని నింగిలోకి పంపారు. ఇందులో క్రూ ఎస్కేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రూ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పారాచూట్ల సాయంతో కిందకి తెచ్చే డిసలరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థ పనితీరుని తెలుసుకున్నారు. రాకెట్​... అందులో ఉన్న క్రూ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని భూమి నుంచి 17 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి విడిచి పెట్టింది. దానికి అమర్చిన 10 ప్యారాచూట్ల సాయంతో 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో క్రూ మాడ్యూల్ ల్యాండ్ అయ్యింది.

అప్పటికే అక్కడ రెడీగా ఉన్న నౌకా దళ సిబ్బంది.. క్రూ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఒడ్డుకి తీసుకొచ్చారు. ఇదంతా ఎనిమిది నిమిషాల్లో జరిగింది. ఈ ప్రయోగం సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ సారి రోబో(వ్యోమ మిత్రా)ని క్రూ మ్యాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచి మరో ప్రయోగం చేయడానికి ఇస్రో రెడీ అవుతోంది. 

లోపం ఉంటే.. 

ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్లే రాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏదైనా లోపం ఉంటే వాళ్ల ప్రాణాలకు ప్రమాదం లేకుండా క్రూ ఎస్కేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాళ్లను రక్షిస్తుంది. వాళ్లు ఉండే క్రూ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వేరు చేసి, సురక్షితంగా కిందకి తీసుకొస్తుంది. అలా తీసుకురాకపోతే సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిగా పనిచేయనట్టే. 

వ్యోమ మిత్ర

గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఇస్రో ఒక హాఫ్ హ్యూమనాయిడ్ రోబోని తయారు చేసింది. దానికి ‘వ్యోమ మిత్ర’ అని పేరు పెట్టారు. గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్ ప్రయోగానికి ముందుగా ఈ రోబోని స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి పంపుతారు. ఆ ఎక్స్​పరిమెంట్ సక్సెస్ అయితే మన ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పంపుతారు. దీనికి మాడ్యూల్ పారామీటర్లను పర్యవేక్షించడం, హెచ్చరికలను జారీ చేయడం, లైఫ్ సపోర్ట్ ఆపరేషన్లు అమలు చేయడం.. లాంటి అన్ని ప్రోగ్రామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇది స్విచ్ ప్యానెల్స్​ను ఆపరేట్ చేయడం నుంచి ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సహచరుడిగా పనిచేయడం, చర్చల్లో పాల్గొనడం, ఎంక్వైరీలకు ప్రతిస్పందించడం లాంటి అన్ని పనులను చేయగలదు.

ఆ నలుగురు...

గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ : తమిళనాడులోని చెన్నయ్​లో1982 ఏప్రిల్19న  జన్మించిన ఈయన వెల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని డీఎస్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ(డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాఫ్​ కాలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో చదువుకున్నాడు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాష్ట్రపతి గోల్డ్ మెడల్, స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నాడు. 2003 జూన్ 21న ఐఏఎఫ్​  ఫైటర్ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సెలక్ట్ అయ్యాడు. ఫ్లయింగ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్టర్​గా పనిచేసిన అజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టెస్ట్ పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దాదాపు 2,900 గంటల అనుభవం ఉంది. Su–30 MKI, MiG–21, MiG–21, Mig–29, జాగ్వార్, డోర్నియర్, An–32 లాంటి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్స్​ నడిపాడు.

గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ : 1967 ఆగస్టు 26న కేరళలోని తిరువాజియాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుట్టాడు. ఎన్డీఏ(నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్ అకాడమీ)లో చదువుకున్నాడు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో స్వోర్డ్ ఆఫ్ ఆనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకున్నాడు. 1998 డిసెంబర్ 19న ఐఏఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైటర్ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సెలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. క్యాట్–ఏ ఫ్లయింగ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన ఆయనకు టెస్ట్ పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 3,000 గంటల ఫ్లయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ ఉంది. Su–30 MKI, MiG–21, MiG–29, హాక్, డోర్నియర్, An–32 వంటి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్స్​ నడిపాడు. యునైటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాఫ్​ కాలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ, తాంబరంలోని ఫ్లయింగ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్స్​ పూర్వ విద్యార్థి నాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ప్రీమియర్ ఫైటర్ Su–30 Sqnకి కమాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా పనిచేశాడు. 

గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ : 1982 జులై 17న ప్రయాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుట్టాడు. ఎన్డీఏలో చదువు పూర్తి చేశాడు. 2004 డిసెంబర్ 18న ఐఏఎఫ్​ ఫైటర్ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సెలక్ట్ అయ్యాడు. ఫ్లయింగ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన అంగద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టెస్ట్ పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దాదాపు 2,000 గంటల ఫ్లయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ ఉంది. అంగద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ Su–30 MKI, MiG–21, MiG–29, జాగ్వార్, హాక్, డోర్నియర్, An–32 లాంటి  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్స్​ నడిపాడు.

వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా : 1985 అక్టోబర్10న ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని లక్నోలో పుట్టాడు. ఎన్డీఏలో చదువుకున్నాడు. 2006 జూన్ 17న ఐఏఎఫ్​  ఫైటర్ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సెలక్ట్ అయ్యాడు. ఫైటర్ కంబాట్ లీడర్​గా అనుభవం ఉంది. టెస్ట్ పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సుమారు 2,000 గంటల ఫ్లయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. Su–30 MKI, MiG–21, MiG–29, జాగ్వార్, హాక్, డోర్నియర్, An–32 లాంటివన్నీ నడిపాడు.

వాలెరి వ్లాదిమిరోవిచ్ పోలియాకోవ్

వాలెరి రష్యాకు చెందిన కాస్మొనాట్‌‌. ఈయన ఒక పర్యటనలో ఎక్కువ కాలం స్పేస్‌‌లో గడిపిన వ్యక్తిగా రికార్డ్‌‌ క్రియేట్‌‌ చేశాడు. వాలెరి ఒకే పర్యటనలో 437 రోజుల 18 గంటలు స్పేస్ స్టేషన్‌‌లో ఉన్నాడు. ఆయన 1988లో సోయుజ్ TM–6 లో అంతరిక్షంలోకి మొదటిసారి వెళ్లాడు. 240 రోజుల తర్వాత TM–7లో భూమికి తిరిగి వచ్చాడు. రెండోసారి సోయుజ్ TM–18 ద్వారా స్పేస్‌‌లోకి వెళ్లాడు. TM–20తో తిరిగొచ్చాడు. అయితే.. రెండోసారి వెళ్లినప్పుడు ఏకంగా 437 రోజులు అంతరిక్షంలో గడిపాడు.

మహిళ ఎందుకు లేదంటే.. 

ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రూలో ఉన్న నలుగురూ మగవాళ్లే. ఆడవాళ్లను ఒక్కరిని కూడా సెలక్ట్ చేయకపోవడానికి ప్రత్యేక కారణం ఉంది. సాధారణంగా ఇలాంటి మిషన్లకు అన్ని దేశాలు వాళ్ల టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైలట్ల పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కొందరిని సెలక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటాయి. ఎందుకంటే.. వాళ్లకు ఫ్లయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంచి స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. నిబ్బరంగా ఉండగలుగుతారు.

అయితే.. గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టినప్పుడు భారత టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైలట్ల పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్క మహిళ కూడా లేరు. అందుకే గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడవాళ్లు లేరు. కానీ.. ఇస్రోలో మాత్రం వివిధ విభాగాల్లో  చాలామంది మహిళలు పనిచేస్తున్నారు. అంతెందుకు చంద్రయాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–3 ప్రయోగంలో సింహ భాగం ఆడవాళ్లదే. 

నాలుగో దేశం

గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయితే.. ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తుంది. ఎందుకంటే.. సోవియట్ యూనియన్, అమెరికా, చైనాల తర్వాత మనిషిని అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా ఇండియా పేరు మార్మోగుతుంది. సోవియట్ యూనియన్, అమెరికా లో ఎర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యటనలు చేయడం మొదలుపెట్టాక కొన్ని దశాబ్దాల వరకు ఏ దేశమూ అటువైపు అడుగులు వేయలేకపోయింది.

ఈ రెండు దేశాలు 1961 నుంచే  అంతరిక్షంలోకి తమవాళ్లను పంపాయి. ఈ మధ్య అక్టోబర్ 2003లో చైనా మిషన్ 21 గంటలు భూమి చుట్టూ14 సార్లు తిరిగి భూమిని చేరింది. దాంతో అంతరిక్షానికి మనుషుల్ని పంపిన మూడో దేశంగా చైనా అవతరించింది. ఇప్పుడు మన దేశం కూడా ఆ జాబితాలో చేరనుంది. అంతేకాదు.. 2035 నాటికి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి, 2040 నాటికి చంద్రుడిపైకి ఆస్ట్రొనాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పంపాలనే లక్ష్యంతో ఇస్రో పనిచేస్తోంది.

ఒలేగ్ కోనోనెంకో 

రష్యన్‌‌ కాస్మొనాట్‌‌ ఒలెగ్ కోనోనెంకో ఈ మధ్యే ఎక్కువ కాలం స్పేస్‌‌లో గడిపిన వ్యక్తిగా రికార్డ్‌‌ క్రియేట్‌‌ చేశాడు. అంతకుముందు ఈ రికార్డ్‌‌ గెన్నాడి ఇవనోవిచ్ పడల్కా పేరిట ఉండేది. గెన్నాడి కూడా రష్యాకు చెందినవాడే.

ఆయన 878 రోజులు అంతరిక్షంలో గడిపి అత్యధిక రోజులు స్పేస్‌‌లో ఉన్న వ్యక్తిగా రికార్డ్ దక్కించుకున్నాడు. అయితే.. ఈ రికార్డ్‌‌ని 2024 ఫిబ్రవరి 4న ఒలేగ్ కోనోనెంకో బ్రేక్‌‌ చేశాడు. 59 ఏండ్ల కోనోనెంకో ఇప్పుడు కూడా ఇంకా స్పేస్‌‌లోనే ఉన్నాడు. 2023 సెప్టెంబర్ 15న స్పేస్‌‌ సెంటర్‌‌‌‌కు వెళ్లిన ఆయన ఈ ఏడు(2024) సెప్టెంబర్ 23 వరకు అక్కడే ఉంటాడు. ఈ లెక్కన ఆయన స్పేస్‌‌లో 1,110 రోజులు ఉంటాడన్నమాట! 

క్రిస్టినా హమ్మాక్ కోచ్

క్రిస్టినా 2013లో నాసాలో చేరారు. ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌‌ఎస్‌‌)లో ఎక్స్‌‌పెడిషన్ 59, 60, 61 కోసం ఫ్లైట్ ఇంజనీర్‌‌గా పనిచేశారు. దాంతో చాలారోజులు స్పేస్‌‌లోనే గడిపారు. అందుకే సింగిల్ జర్నీలో ఎక్కువ రోజులు స్పేస్‌‌లో గడిపిన మహిళగా రికార్డ్‌‌ క్రియేట్‌‌ చేశారు. ఈమె మొత్తం 328 రోజుల 13 గంటల 58 నిమిషాలు అంతరిక్షంలో ఉన్నారు. ప్రస్తుతం నాసా చేపట్టిన ‘ఆర్టెమిస్–II మిషన్‌‌’లో  మిషన్ స్పెషలిస్ట్‌‌గా పనిచేస్తున్నారు. 

నీల్ ఆల్డెన్ ఆర్మ్‌‌స్ట్రాంగ్ 

చంద్రుని మీద మొదటి సారి కాలు పెట్టిన ఆస్ట్రొనాట్‌‌ నీల్‌‌ ఆర్మ్​స్ట్రాంగ్​. ఈయన అమెరికాకు చెందిన ఏరోనాటికల్ ఇంజనీర్. నావల్ ఏవియేటర్ , టెస్ట్ పైలట్‌‌, యూనివర్సిటీ ప్రొఫెసర్‌‌‌‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. 1966లో ‘జెమిని–8 మిషన్‌‌’కు కమాండ్ పైలట్‌‌గా మొదటి అంతరిక్ష ప్రయాణాన్ని చేశారు. నాసా నుంచి అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి ఆస్ట్రొనాట్‌‌ కూడా ఈయనే. అపోలో–11 కమాండర్‌‌గా నీల్‌‌ రెండో అంతరిక్ష ప్రయాణం చేశాడు. ఇందులో భాగంగానే జులై 20, 1969న చంద్రుని మీద కాలుపెట్టాడు. 

యూరి గగారిన్ 

అసలు పేరు యూరి అలెక్సెయెవిచ్ గగారిన్. ఇతను సోవియట్ కాస్మొనాట్‌‌. రష్యన్లు గగారిన్‌‌ని సోవియట్ హీరోగా చెప్తుంటారు. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మనిషిగా రికార్డ్‌‌ క్రియేట్‌‌ చేశాడు. అంతేకాదు.. భూమి చుట్టూ తిరిగిన మొదటి వ్యక్తి కూడా ఈయనే. అంతరిక్షంలోకి ప్రయాణించినందుకు గగారిన్‌‌కు ప్రపంచంలోని అనేక దేశాలు, పతకాలు, అవార్డులు ఇచ్చి గౌరవించాయి. ఈయన ‘వోస్టోక్–1స్పేస్‌‌ షిప్‌‌’ ద్వారా 1961 ఏప్రిల్ 12న స్పేస్‌‌లోకి వెళ్లారు. గంటా 48 నిమిషాలు గడిపి తిరిగి వచ్చేశాడు. 

- కరుణాకర్ మానెగాళ్ల