కర్నాటకలో మరో 5 ఒమిక్రాన్ కేసులు

కర్నాటకలో మరో 5 ఒమిక్రాన్ కేసులు

బెంగళూరు: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా, కర్నాటకలో మరో ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 19కి చేరింది. ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన వారిలో 19 నుంచి 82 ఏళ్ల వయస్కుల వాళ్లు ఉండటం గమనార్హం. అయితే వీళ్ల ట్రావెల్ హిస్టరీ, కరోనా ఎలా సోకి ఉండొచ్చు, ఇంటర్నేషనల్ ట్రావెలర్ తో కాంటాక్ట్ అయ్యారా అనే విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. కొత్త ఒమిక్రాన్ కేసుల్లో ఇద్దరు ఉడుపి (82 ఏళ్ల వృద్ధుడు, 73 ఏళ్ల వృద్ధురాలు)కి చెందిన వారని.. మిగతా ముగ్గురు ధార్వాడ్, మంగళూరు, భద్రావతికి చెందిన వారని కర్నాటక హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కె.సుధాకర్ తెలిపారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలోని బెళగావి, దక్షిణ కన్నడ, ధార్వాడ్, ఉడుపితోపాటు శివమొగ్గలో పలు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తల కోసం: 

వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి.. బూస్టర్ డోసు తప్పనిసరి

టీవీ షో నిర్వాహకులపై పరిణీతి చోప్రా సీరియస్

ఈతరం పెండ్లి పిల్లల్లో ఫుల్ జోష్