కరోనా భయపెడుతోంది.. సభలు, రోడ్ షోలు వద్దు

కరోనా భయపెడుతోంది.. సభలు, రోడ్ షోలు వద్దు

ఎన్నికల కమిషన్ కు వీకే పాల్ సూచన

న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా కేసులు ఎక్కువవుతుండటం, ఒమిక్రాన్ భయాందోళనలు పెరుగుతున్నాయి. మరోవైపు 5 రాష్ట్రాల్లో (పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్, గోవా) అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలతో పార్టీలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఈ విషయంపై నేషనల్ కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ స్పందించారు. ఈ సమయంలో ఎలక్షన్ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించడం సరికాదని ఎన్నికల కమిషన్ కు సూచించారు. ఈ తరుణంలో ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడంపై పునరాలోచించాలని కోరారు. 

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా జాగ్రత్త చర్యలు అవసరమని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని పాల్ స్పష్టం చేశారు. అయితే రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలు, రోడ్ షోలను ఆపే ఆలోచనలో ఈసీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఎన్నికల సమయంలో ప్రచారాలు వద్దని వారించడం అంటే పార్టీల హక్కులను హరించినట్లు అవుతుందని ఈసీ భావిస్తోంది. ఈ క్రమంలో పార్టీలే స్వచ్ఛందంగా ప్రచార ర్యాలీలు, సభలను తగ్గించుకోవాలని ఈసీ సూచించినట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ కూడా నివేదించినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తల కోసం:

పోలీసుల విచారణకు రాఘవను అప్పగిస్తా

కర్నాటకలో వీకెండ్ కర్ఫ్యూ

రెవెన్యూ లోటు భర్తీ: 17 రాష్ట్రాలకు కేంద్రం నిధులు