
బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొద్దిసేపటి క్రితమే ఆయన గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. రెండురోజులుగా నీరసంగా ఉండడంతో కరోనా టెస్టు చేయించుకుని, పాజిటివ్‌గా తేలడంతో వెంటనే ప్రభుత్వ గాంధీ హాస్పిటల్‌కు వెళ్లి చేయించుకుని ఇంటికి చేరానని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం తనకు మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. అయితే కొద్ది రోజులుగా తనకు అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ ఆగస్టు 8న బీఎస్పీలో చేరారు. నల్గొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన‘ రాజ్యాధికార సంకల్ప సభ‘లో బీఎస్పీ నేషనల్ కో-ఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో బీఎస్పీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను రాంజీ గౌతమ్ ప్రకటించారు.
గత రెండురోజులుగా నీరసంగా ఉంటే Covid టెస్టు చేయించుకుని, Positive గా నిర్దారణ అయిన వెంటనే ప్రభుత్వ గాంధీ హాస్పిటల్ కు వచ్చి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జి అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులూ,Please isolate yourselves. I have mild symptoms. Nothing to worry at all. pic.twitter.com/mqYTfC8fmL
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) August 10, 2021