
గచ్చిబౌలి: రాష్ట్రంలో కరోనా మహామ్మారి వేగంగా విస్తరిస్తోంది. వైరస్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. కరోనా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయించి, పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించాలని రాష్ట్ర వైద్య సిబ్బంది ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే తాజాగా జిహెచ్ఎమ్‌సీ పరిధిలోని కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బోనాల పండుగ సెలవు అంటూ కోవిడ్ పరీక్షల నిలిపివేశారు. దీంతో పరీక్షలు చేయించుకుందామని వచ్చిన బాధితులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి అవలంబిస్తున్న తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.