కరోనా వైరస్​ చైనాలో పుట్టలేదంట... అమెరికా ఏజెన్సీల షాకింగ్​ రిపోర్ట్​

కరోనా వైరస్​ చైనాలో పుట్టలేదంట... అమెరికా ఏజెన్సీల షాకింగ్​ రిపోర్ట్​

కరోనా.. ఈ పేరు వింటనే ఇప్పటికీ హడలెత్తిపోతాం. 20వ శతాబ్దపు ప్రజలను 3 ఏళ్ల పాటు పట్టి పీడించిన మహ్మమారి ఈ కరోనా. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రాణాలను హరించిన ఈ మహమ్మారి ఇప్పటికి మన మధ్యే ఉంది. అయితే 2019లో చైనా నుంచి ఇది వ్యాప్తి చెందింది. అప్పటి నుంచి ఆ దేశంపై ప్రపంచ దేశాలకు అనేక అనుమానాలు ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం దాన్ని కృత్రిమంగా సృష్టించి మానవ జాతిపై చైనా ప్రయోగించిందని అప్పట్లో సంచలన కామెంట్స్​ చేసింది. వూహాన్​లోని వైరాలజీ ల్యాబ్​నే కరోనా వైరస్​ని సృష్టించడానికి చైనా ఎంచుకుందని అప్పట్లో ప్రపంచం కోడై కూసింది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం తప్పుబట్టింది. అయితే ఆ తప్పు నిజమే అని అమెరికా కు చెందిన ఓ నివేదిక చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. 

ఆధారాలేవి లేవు..

కొవిడ్​19 మహమ్మారి చైనాలోని వూహాన్​వైరాలజీ ల్యాబ్​లోనే పుట్టిందనడానికి ప్రత్యక్ష ఆధారాలేవీ లేవని అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్​ ఏజెన్సీ నివేదిక జూన్​23న వెల్లడించింది. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ వైరాలజీ ల్యాబ్​ నుంచే లీక్​ అయి ఉంటుందనే విషయాన్ని నాలుగు పేజీలతో కూడిన ఆ  రిపోర్ట్ తోసిపుచ్చలేదు. తాము కరోనా మూలాలను అక్కడే ఉన్నట్లు కనుక్కోలేదని అంతమాత్రాన అక్కడి నుంచి లీక్​ కాలేదని మాత్రం చెప్పలేమని ఏజెన్సీ అధికారులు స్పష్టం చేశారు. ఇంకా ఈ అంశంపై పరిశోధనలు జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.