కరోనా బారిన సెలబ్రిటీలు

V6 Velugu Posted on Apr 04, 2021

కరోనా సెకండ్ వేవ్ స్పీడ్ గా విస్తరిస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఇలా ఎవ్వరినీ వదలడం లేదు. ఇటీవల సచిన్ టెండుల్కర్, అలియా భట్, పరేష్ రావల్, రణ్ బీర్ కపూర్, అమీర్ ఖాన్, మాధవన్ లు కరోనా బారిన పడగా.. లేటెస్గ్ గా అక్షయ్ కుమార్, నటి నివేద థామస్, క్రికెటర్ అక్షర్ పటేల్,నితీష్ రాణా, దేవదత్ పడిక్కల్ లకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. పాజిటివ్ రాడంతో వీరంతా హోం క్వారంటైన్ లో ఉన్నట్లు ప్రకటించారు. డాక్టర్ల సూచనలతో చికిత్స తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవల తమను కలిసిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరో వైపు దేశ వ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 93 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

Tagged COVID19, Positive, akshay kumar, Nivetha Thomas

Latest Videos

Subscribe Now

More News