కోవిషీల్డ్ బూస్టర్ డోస్ రూ. 600

కోవిషీల్డ్ బూస్టర్ డోస్ రూ. 600

చైనాలో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటంతో.. 18 ఏండ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ వేసుకోవడానికి కేంద్రం అనుమతించింది. అయితే ఈ బూస్టర్ డోసును మాత్రం ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ మాదిరిగా ఫ్రీగా కాకుండా.. ప్రైవేట్‎గా వేయించుకోవాలని సూచించింది.  ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఆదివారం నుంచి కరోనా వైరస్ బూస్టర్ షాట్‌లను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా స్వాగతించారు. ఇది కీలకమైన మరియు సమయానుకూల నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. అనేక దేశాలు బూస్టర్ డోస్ తీసుకోని వారిపై ఆంక్షలు విధించినందున మూడో డోస్ అనివార్యం అయింది. దాంతో చాలామంది బూస్టర్ డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా.. ఇప్పటికే ప్రభుత్వం హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులు ఉచితంగా అందిస్తోంది.  

అదర్ పూనావాలా మాట్లాడుతూ.. కోవిషీల్డ్ బూస్టర్ డోస్ ధర రూ. 600గా నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి అదనంగా ట్యాక్స్ ఉంటుందని ఆయన చెప్పారు. అదేవిధంగా కోవో వ్యాక్స్ ఒకసారి బూస్టర్‌గా ఆమోదించబడితే.. ఈ వ్యాక్సిన్ కూడా రూ.900లకు అందుబాటులోకి రానుందని తెలిపారు. దీనికి కూడా పన్నులు అదనమని పూనావాలా తెలిపారు. బూస్టర్‌లను అందించే ఆసుపత్రులు, డిస్ట్రిబ్యూటర్‌లకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ భారీ తగ్గింపులను అందజేస్తుందని ఆయన చెప్పారు.

For More News..

గవర్నర్‎ వ్యవహారంలో బీజేపీ తల దూర్చదు

హైదరాబాద్ డ్రగ్స్‎కు అడ్డాగా మారడానికి కేసీఆరే కారణం

కరోనా బూస్టర్ డోస్ పై కేంద్రం కీలక నిర్ణయం