టీటీడీ కామన్ గుడ్ ఫండ్ పెంపు.. వేద పండితులకు నిరుద్యోగ భృతి : సమీక్షా సమావేశంలో నిర్ణయం

టీటీడీ కామన్ గుడ్ ఫండ్ పెంపు.. వేద పండితులకు నిరుద్యోగ భృతి :  సమీక్షా సమావేశంలో నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం కామన్ గుడ్ ఫండ్ పెంచుతూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో 5 శాతం ఉన్న దానిని 9 శాతంకు పెంచినట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. శనివారం (జులై 12) టీటీడీ, దేవాదాయశాఖ సంయుక్త సమావేశంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి అనం రామనారాయణ రెడ్డి అధ్వర్యంలో.. టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ జె. శ్యామలరావు, దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ వినయ్ చంద్ కలిసి దేవాదాయ శాఖ, టీటీడీ మధ్య పెండింగ్‌లో ఉన్న సంయుక్త అంశాలపై అన్నమయ్య భవనంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు  కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ALSO READ | టీటీడీ ఉద్యోగుల సమస్యలపై సీఎంకు నివేదిక ఇస్తాం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..

దేవాదాయ చట్టం ప్రకారం 9 శాతం కామన్ గుడ్ ఫండ్ టీటీడీ నుంచి తీసుకునే సదుపాయం ఉందని.. గతంలో గతంలో 5 శాతం ఉన్న దానిని 9 శాతంకు పెంచినట్లు మంత్రి ఆనం చెప్పారు. ఈ ఫండ్ తో పలు అభివృద్ధి పనులతో పాటు వేద పండితులకు భృతి కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్న అర్చక స్వాములకు భృతి ఇవ్వాలనీ మేనిఫెస్టో ఉందని.. ఆ మేరకు 590 వేద పండితులకు 3 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

శ్రీవాణి ట్రస్టు ద్వారా  రాష్ట్రంలోని పునర్ నిర్మాణంలో ఉన్న ఆలయాలకు రూ.147 కోట్లు విడుదల కాగా నిలిచిపోయాయని.. శ్రీవాణి ట్రస్టు ద్వారా మరో 11 కోట్లు నిధులు మిగతా ఆలయాలకు రావాల్సి ఉందని మంత్రి తెలిపారు. వీటింటిని చర్చించి నిర్ణయం తీసుకుంటామని బోర్డు, అధికారులు చెప్పారు మంత్రికి చెప్పారు. 

విజయవాడ దుర్గ గుడికి వెళ్లేందుకు మరో రోడ్డు మార్గం అవసరం ఉందని.. దానికి టీటీడీ సహకారం కావాలని సమీక్ష సందర్భంగా మంత్రి తెలిపారు. టీటీడీలో అన్యమతస్థులు ఉండేది వాస్తవమేనని.. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించినట్లు.. టీటీడీలో వేయి మంది అన్యమతస్థులు ఉన్నారన్న దానిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. టీటీడీ కాలేజీ, పాఠశాలల్లో ఉన్న 192 పోస్టులను ఒప్పంద లెక్చరర్ లతో భర్తీ అంశంపై చర్చించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్, టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ సత్యనారాయణ, దేవాదాయ శాఖ ఉపకార్యదర్శి శ్రీ సుధాకర్ రావు, ఏపీ దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీ జి.వి.ఆర్. శేఖర్, పలువురు టీటీడీ, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.