కొవ్యాక్సిన్ కంటే కొవిషీల్డ్‌లో మెరుగ్గా యాంటీబాడీస్

కొవ్యాక్సిన్ కంటే కొవిషీల్డ్‌లో మెరుగ్గా యాంటీబాడీస్

న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరిలో ఏ వ్యాక్సిన్‌ తీసుకోవాలనే మీమాంస ఏర్పడింది. ప్రస్తుతం కొవ్యాక్సిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో వీటిల్లో ఏ టీకా తీసుకుంటే ఎక్కువ యాంటీ బాడీస్ వస్తాయని, ఏది ఎక్కువ ప్రభావవంతమనే దానిపై ఓ రీసెర్చ్ జరిగింది. కరోనా వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ యాంటీబాడీ టిట్రే (కోవ్యాట్) కొవ్యాక్సిన్, కొవిషీల్డ్ టీకాలపై ఓ స్టడీని నిర్వహించింది. ఈ పరిశోధనలో కొవ్యాక్సిన్‌లో కంటే కొవిషీల్డ్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు మెరుగ్గా ఉత్పత్తి  అవుతున్నట్లు తేలింది. మన దేశంలో కొవిషీల్డ్, కొవ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 215 మంది హెల్త్ ‌వర్కర్‌లపై ఈ సర్వే చేశారు. ఇమ్యూనిటీ పరంగా ఈ రెండు టీకాలు మంచి ఫలితాలను చూపించాయని రీసెర్చర్స్ తెలిపారు. అయితే రెస్పాండర్ రేట్ అండ్ మీడియన్ (ఐక్యూఆర్)ను తీసుకుంటే కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారిలో 86.8 శాతంగా ఉండగా.. కొవ్యాక్సిన్‌‌ తీసుకున్న వారిలో 43.8 శాతం ఐక్యూఆర్‌‌ నమోదైంది. అలాగే సెరొపాజిటివీ రేట్ కూడా  ఎక్కువగా ఉన్నట్లు తేలింది.