
- 16 దూడలకు తల్లి
బజార్ హత్నూర్, వెలుగు: బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని శివాలయానికి కానుకగా ఇచ్చిన ఆవు గురువారం చనిపోయింది. దీంతో గ్రామస్తులంతా ఆవుకు పూజలు చేసి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. 20 ఏండ్ల క్రితం మండల కేంద్రానికి చెందిన సబ్సిడి పుష్పలత, నందు కుమార్ కుటుంబీకులు ఆలయానికి ఆవును విరాళంగా అందించారు.
.ఈ ఆవు ఇప్పటివరకు16 దూడలకు జన్మనిచ్చింది. రెండు దశాబ్దాలుగా ఆలయంలో ధూప దీప నైవేద్యాలతో ఆదాయం సమకూర్చిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇంతకాలం పవిత్రంగా పూజించిన ఆవు చనిపోవడంతో గ్రామస్తులంతా కలిసి డప్పువాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలో ఆవుకు అంత్యక్రియలు నిర్వహించారు.