
- సైబర్ వారియర్స్ కు టీ షర్ట్స్ అందజేసిన సీపీ అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అలర్ట్గా ఉండేవిధంగా అవగాహన కల్పించాలని సీపీ అనురాధ పోలీస్సిబ్బందికి సూచించారు. సోమవారం సీపీ ఆఫీస్ లో సైబర్ వారియర్స్ కు టీ షర్ట్స్ అందజేశారు. ఆమె మాట్లాడుతూ సైబర్ వారియర్స్ వచ్చే కాల్స్ ను వెంటనే అటెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీనివాస్, జిల్లాలోని సైబర్ వారియర్స్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.