హైదరాబాద్ లో డ్రగ్స్, గంజాయి మాట వినపడొద్దు: సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ లో డ్రగ్స్, గంజాయి మాట వినపడొద్దు: సీపీ కొత్త  కోట శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, గంజాయి మాట వినపడొద్దని పోలీసు అధికారులను ఆదేశించారు సీపీ కొత్త  కోట శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో  ఐసిసిసి భవనంలోని ఆడిటోరియంలో డిసెంబర్ 17వ తేదీ ఆదివారం సీపీ శ్రీనివాస్ రెడ్డి..  నగరంలో ప్రాథమిక పోలీసింగ్, విచారణ, ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి అన్ని జోనల్ డిసిపిలు, ఎసిపిలు, ఇన్‌స్పెక్టర్లతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు.

రెండు నెలల్లో హైదరాబాద్ లో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలని చెప్పారు. సిటీలో డ్రగ్స్  ను పూర్తిగా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోండని సీపీ ఆదేశించారు. నిజమైన బాధితుడికి మాత్రమే పెండ్లి పోలీస్ వర్తిస్తుందని.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే.. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు సూచించారు.

 ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించిన విషయం తెలిసిందే. తెలంగాణలో డ్రగ్స్ వినియోగించినా.. విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని.. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు చర్యలు చేపడుతున్నారు.