యాదగిరిగుట్ట, వెలుగు : త్వరలో యాదాద్రి కొండపై యాదగిరిగుట్ట టెంపుల్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ తెలిపారు. మరో వారం పాటు ఇంతకుముందు కొనసాగినట్టే గుట్టపై బందోబస్తు ఉంటుందన్నారు. సోమవారం డీసీపీ నారాయణరెడ్డితో కలిసి సీపీ మాట్లాడుతూ భక్తులు టెంపుల్‌లోకి సెల్ఫోన్లు తీసుకువెళ్లకుండా డిపాజిట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. పర్మినెంట్‌గా టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 150 సీసీ కెమెరాలను బిగిస్తామన్నారు. ఇక్కడే కమాండ్ కంట్రోల్‌రూం ఏర్పాటు చేశామన్నారు.
