మొబైల్ బైక్స్ వస్తయ్..ట్రాఫిక్ క్లియర్ చేస్తయ్! : శ్రీనివాసరెడ్డి

మొబైల్ బైక్స్ వస్తయ్..ట్రాఫిక్ క్లియర్ చేస్తయ్! : శ్రీనివాసరెడ్డి
  • సైరన్‌‌‌‌, పీఏఎస్‌‌‌‌, ఫస్ట్‌‌‌‌ ఎయిడ్ కిట్స్‌‌‌‌తో అందుబాటులోకి ట్రాఫిక్ బైక్స్
  •  ట్రాఫిక్ జామ్ ఏర్పడినా.. యాక్సిడెంట్లు అయినా వెంటనే అక్కడికి.. 
  •  సిటీలో ట్రాఫిక్ క్లియర్‌‌‌‌‌‌‌‌   చేయడంలో పోలీసులు  స్పెషల్ ఫోకస్
  • 108 ట్రాఫిక్‌‌‌‌ మొబైల్‌‌‌‌ బైక్స్‌‌‌‌ను ప్రారంభించిన సీపీ శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌‌‌‌,వెలుగు : “ సిటీలో ట్రాఫిక్ జామ్ లు అయినా.. ప్రమాదాలు జరిగినా వెంటనే ట్రాఫిక్ మొబైల్‌‌‌‌ బైక్స్‌‌‌‌ సైరన్ వేసుకొని అక్కడికి వస్తాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు బైక్స్‌‌‌‌ ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం సిటీలో వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌‌‌‌ మొబైల్‌‌‌‌ బైక్స్‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చాం”.. అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రోడ్‌‌‌‌ సేఫ్టీ మాసోత్సవాల్లో భాగంగా సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 

నెక్లెస్‌‌‌‌ రోడ్స్‌‌‌‌లో నిర్వహించగా సీపీ  గెస్ట్ గా హాజరై ట్రాఫిక్ చీఫ్‌‌‌‌ విశ్వప్రసాద్‌‌‌‌తో కలిసి 108 ట్రాఫిక్ మొబైల్ బైక్స్‌‌‌‌ను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు.  యూత్ సినీనటులను ఆదర్శంగా తీసుకున్నట్లుగానే, వాళ్లు చెప్పింది కూడా వినాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి సూచించారు. యాక్సిడెంట్లలో నటులు సాయిధరమ్‌‌‌‌ తేజ్‌‌‌‌, డీజే టిల్లు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.. ఇందుకు కారణం వారు పెట్టుకున్న హెల్మెట్‌‌‌‌, సీట్‌‌‌‌ బెల్ట్‌‌‌‌ నే అని గుర్తుచేశారు. 

వాహనాల రద్దీ దృష్ట్యా..

ట్రాఫిక్‌‌‌‌ మొబైల్ వెహికల్స్‌‌‌‌ ఉన్నప్పటికీ కొంతకాలంగా పనిచేయడంలేదని తెలిపారు. దీంతో ట్రాఫిక్  బైక్స్‌‌‌‌ అందుబాటులోకి తెచ్చినట్టు.. వాటికి పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్‌‌‌‌ ద్వారా వాహనదారులకు అవగాహన కలిగిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి స్పాట్‌‌‌‌లోనే ఫస్ట్ ఎయిడ్ చేసేందుకు మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంటాయన్నారు. 

150 రోడ్‌‌‌‌ సేఫ్టీ అవేర్ నెస్  క్యాంపులు నిర్వహించినట్లు చెప్పారు. 30వేల మందికి పైగా బస్సు, ట్రక్కు,ఆటో డ్రైవర్లు, ప్రజలకు అవగాహన కల్పించామని చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో యువత వెనకబడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు