బీసీ బిల్లును గవర్నర్ ఆమోదించాలి : సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్

బీసీ బిల్లును గవర్నర్ ఆమోదించాలి : సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్

హుజూర్ నగర్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తేనే వారి అభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని, గవర్నర్ వెంటనే ఆ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. 

ఈ బిల్లుపై రాజకీయాలు చేయడం తగదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యల్లావుల రాములు, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, నాయకులు యల్లావుల రమేశ్, జక్కుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.