కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి : సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస రావు

కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి : సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస రావు

నక్కలగుట్ట, వెలుగు: పోక్సో కేసు నుంచి తన కొడుకును రక్షించుకోడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ కాళోజీ సెంటర్ లో సీపీఐ హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. 

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ బండి సంజయ్ తన కుమారుడిని రక్షించుకునేందుకు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి భగీరథ్ ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేదునూరి జ్యోతి, బి.విజయసారధి, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.