సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి .. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పిలుపు

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి .. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పిలుపు

హైదరాబాద్, వెలుగు: పది కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సమాఖ్యలు, సంఘాల పిలుపు మేరకు బుధవారం నిర్వహించే జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. 

ఇది కేవలం కార్మికులకు సంబంధించిన సమ్మె కాదని, నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ద్రవ్యోల్బణం, కనీస వేతనం, పెన్షన్ తదితర సామాన్యుల సమస్యలపై జరుగుతున్న పోరాటమని తెలిపారు.17 డిమాండ్లతో జాతీయ సమ్మె జరుగుతున్నదని, సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని చెప్పారు. సమ్మెలో సీపీఐ శ్రేణులు ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతున్నారని, ప్రజలంతా సంఘీభావాన్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.