గ్రామాల అభివృద్ధికి పట్టుదలతో పనిచేయండి : సీపీఐ సీనియర్‌‌‌‌ నేత చాడ వెంకటరెడ్డి

గ్రామాల అభివృద్ధికి పట్టుదలతో పనిచేయండి  : సీపీఐ సీనియర్‌‌‌‌ నేత చాడ వెంకటరెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరించడంతోపాటు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్‌‌‌‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌‌లో ఇటీవల జరిగిన జీపీ ఎన్నికల్లో సీపీఐ మద్దతుతో గెలిచిన సర్పంచ్ కొయ్యడ సృజన్ కుమార్, ఉప సర్పంచులు పైడిపల్లి వెంకటేశ్‌‌, చింతపూల అనిల్ కుమార్‌‌‌‌, వార్డు సభ్యులను ఎన్నికైన వారిని శాలువాలతో సన్మానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో గ్రామాలను అభివృద్ధి పరచుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్‌‌‌‌రెడ్డి, బోయిని అశోక్, నాగెల్లి లక్ష్మారెడ్డి, బత్తుల బాబు, గూడెం లక్ష్మి, పిట్టల సమ్మయ్య, తదితరులు   పాల్గొన్నారు