పోరాటాలతో నిరుపేదలకు భూములు పంపిణీ చేస్తాం : చాడ వెంకటరెడ్డి

పోరాటాలతో నిరుపేదలకు భూములు పంపిణీ చేస్తాం : చాడ వెంకటరెడ్డి

సిద్దిపేట జిల్లా : హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా పోరాటాల ద్వారా నిరుపేదలకు భూములు పంపిణీ చేస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు అందే వరకూ ప్రజా పోరాటాలు చేస్తామన్నారు. రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ ను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో సీపీఐకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.