మానేర్ రివర్ ఫ్రంట్ పనులపై విచారణ జరపాలి .. సీఎంకు చాడ వెంకటరెడ్డి వినతి

మానేర్ రివర్ ఫ్రంట్ పనులపై విచారణ జరపాలి .. సీఎంకు చాడ వెంకటరెడ్డి వినతి

కరీంనగర్ సిటీ, వెలుగు: నగరంలోని మానేరు రివర్‌‌  ఫ్రంట్‌‌  పనుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై, సంబంధిత గుత్తేదారుపై, గత పాలకుల పాత్రపై విజిలెన్స్‌‌  విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి వినతిపత్రం అందజేశారు. నగరంలో మానేరు రివర్‌‌  ఫ్రంట్‌‌  అభివృద్ధి పనుల పేరుతో గత ప్రభుత్వం రివర్‌‌  ఫ్రంట్‌‌  నిర్మాణం కోసం రూ.500 కోట్లు మంజూరు చేసిందని, అందులో టూరిజం శాఖకు రూ.100 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.100 కోట్లు రిలీజ్​చేశారని పేర్కొన్నారు.

 గత ప్రభుత్వం చేపట్టిన పనుల్లో నాణ్యత పాటించలేదని, పనులు కూడా పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.