ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. జైల్లో ఉండాల్సినోళ్లు బయటున్నరు: సీపీఐ నేత నారాయణ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. జైల్లో ఉండాల్సినోళ్లు బయటున్నరు: సీపీఐ నేత నారాయణ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలులో ఉండాల్సినోళ్లు బయట.. బయట ఉండాల్సినోళ్లు జైలులో ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అసలైన నిందితులను వదిలి.. రాజకీయ కక్షసాధింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నదని ఆరోపించారు.

మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నారాయణ మీడియాతో మాట్లాడారు. కవిత అరెస్ట్ అంటూ చెప్పిన సంజయ్​ను పదవి నుంచి తొలగించారని.. దీన్ని బట్టి చూస్తే బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ ఒక్కటే అని తేలిపోయిందన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో సర్కార్ పెద్దల కమీషన్లు పెరగడంతోనే క్వాలిటీ పడిపోయిందని విమర్శించారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగడానికి కారణం సంఘవిద్రోహశక్తులని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారని చెప్పారు.