బీసీ రిజర్వేషన్లకు బీజేపీయే అడ్డంకి : తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

బీసీ రిజర్వేషన్లకు బీజేపీయే అడ్డంకి : తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

హనుమకొండసిటీ, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు బీజేపీయే ప్రధాన అడ్డంకి అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా సీపీఐ సమితి సమావేశం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి అధ్యక్షతన బాలసముద్రంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ధ్వంధ్వ వైఖరి అవలంభిస్తుందని మండిపడ్డారు. ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలని డిమాండ్ చేశారు.

 రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి బీసీలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండం సదాలక్ష్మీ, అశోక్, స్టాలిన్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేశ్, కార్యవర్గసభ్యులు కర్రె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.