
చిగురుమామిడి, వెలుగు: సంక్షేమ పథకాలను నిజమైన అర్హులకు ఇవ్వడం లేదంటూ చిగురుమామిడి ఎంపీడీవో ఆఫీస్ ముట్టడికి సీపీఐ లీడర్లు సోమవారం యత్నించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న ఎంపీడీవోపై జిల్లా అధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న సీపీఐ లీడర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో లీడర్లు నాగెల్లి లక్ష్మారెడ్డి, అందె స్వామి, అశోక్, గూడెం లక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, చిన్నస్వామి, రాజు, సత్యనారాయణ, యుగేందర్, పాల్గొన్నారు.