మా రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి

మా రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో  చూడండి

ఏపీలో పరిస్థితులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తానన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఏపీలో గతుకులు, గుంతల రోడ్లు, అప్రకటిత విద్యుత్ కోతల మీద  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏకీభవిస్తానన్నారు. ఏపీలో కరెంట్, నీళ్లు లేవని.. రోడ్లు ద్వంసమయ్యాయని కేటీఆర్ నిన్న కామెంట్స్ చేశారు. దీనిపై ఏపీ మంత్రులు కేటీఆర్ ను తప్పుబడుతూ కౌంటర్ ఇచ్చారు. కౌంటర్లతో వెనక్కి తగ్గిన కేటీఆర్ తన వ్యాఖ్యలకు ట్విట్టర్లో కూడా వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని ట్వీట్ చేశారు.

మంత్రుల వ్యాఖ్యలను తప్పుబట్టిన   సీపీఐ నారాయణ  కేటీఆర్ వ్యాఖ్యలను ఏకీభవించారు. అంతేగాకుండా.. ఏపీ, తమిళనాడు  సరిహద్దు ప్రాంతంలో సందర్శించి ఆంధ్ర రోడ్ల యొక్క స్థితిగతులను తమిళనాడు యొక్క స్థితిగతులను వీడియో తీసి చూపించారు. ఏపీలో రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని.. తమిళనాడు రోడ్లు చక్కగా ఉన్నాయన్నారు. ఈ రెండింటి మధ్య పోలికలు చూస్తుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. నగరి మండలం తన స్వగ్రామమైన అయణంబాకం గ్రామానికి వచ్చే రోడ్ల పరిస్థితి చూడండి అని వీడియో తీసి చూపెట్టారు.