కే‌‌‌‌సీ‌‌‌‌ఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు 

కే‌‌‌‌సీ‌‌‌‌ఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు 

సూర్యాపేట, వెలుగు : మాజీ సీ‌‌‌‌ఎం కేసీ‌‌‌‌ఆర్ సూర్యాపేట జిల్లా పర్యటన నేపథ్యంలో ఆదివారం సీపీ‌‌‌‌ఐ(ఎం‌‌‌‌ఎల్) పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ( ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు వెంకన్న విలేకరులతో మాట్లాడుతూ అక్రమంగా అరెస్టు చేసిన తమ పార్టీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అక్రమ అరెస్టులను ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. ఎన్ని అరెస్టులు చేసినా పేదలపక్షాన పోరాటం చేస్తామన్నారు. కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి​అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. అవినీతిపరులైన కేసీఆర్, జగదీశ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయకుండా ప్రశ్నిస్తున్న తమను అరెస్టు చేయడం తగదన్నారు. ఆయన వెంట ఐఎఫ్ టీయూ జిల్లా నాయకులు వాజీద్, మాస్ లైన్ పట్టణ కార్యదర్శి గులాం, నాయకులు పిడమర్తి లింగన్న, గౌస్, పద్మజ, అంజన్న తదితరులు ఉన్నారు.