ఐదు పంచాయతీలు తెలంగాణలో కలపాలె:కూనంనేని

ఐదు పంచాయతీలు తెలంగాణలో కలపాలె:కూనంనేని

భద్రాచలం, వెలుగు: ఏపీలో కలిసిన పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం, ఎటపాక, పిచ్చుకలపాడు  ఐదు పంచాయతీలను తక్షణమే తెలంగాణలో విలీనం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. భద్రాచలంలో మంగళవారం ఆయన సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్​ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

పార్లమెంట్​లో హిందీ భాష పేరుతో కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డిని అవమానపరిచిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్​ప్రకారం పార్లమెంట్​లో 22 భాషల్లో మాట్లాడవచ్చని గుర్తుచేశారు. దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు మాట్లాడుతుంటే స్పీకర్​ తిరస్కరణ ధోరణి చూపడం సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎన్నికల కమిటీలు వేసి బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరి గెలుపైనా, ఓటమైనా సీపీఐయే నిర్ణయిస్తుందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్​పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్​, బొల్లోజు అయోధ్య, రావులపల్లి రవికుమార్, నరాటి ప్రసాద్, ఆకోజు సునీల్, కల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు 
పాల్గొన్నారు.