
జన్నారం, వెలుగు: జన్నారం మండల కేంద్రంలోని పీహెచ్సీని 30 పడకల హాస్పిటల్గా మార్చాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. సీపీఎం మండల కమిటీ బృందంతో కలిసి శనివారం పీహెచ్సీని సందర్శించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పీహెచ్సీలో సరైన వైద్య సేవలు అందడం లేదని జేఏసీ నేతలు పేర్కొన్నారు.
దీంతో జగిత్యాల, మంచిర్యాల ఇతర పట్టణాలకు వైద్యం కోసం వెళ్లాల్సి వస్తోందన్నారు. నిరపేదల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలతో కూడిన 30 పడకల హాస్పిటల్గా మార్చాలని కోరారు. సీపీఎం మండల కార్యదర్శి కె.ఆశోక్, నాయకులు బుచ్చయ్య, జయ, అబ్దుల్లా, రాజన్న,రవి కుమార్, లక్ష్మణ్, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.